గల్లా అశోక్ మూవీ లాంచ్‌కి స్పెషల్ గెస్ట్ ఎవ‌రో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 5:02 AM GMT
గల్లా అశోక్ మూవీ లాంచ్‌కి స్పెషల్ గెస్ట్ ఎవ‌రో తెలుసా..?

సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ మనవడు, గల్లా పద్మావతి, జయదేవ్ దంపతుల కుమారుడు గల్లా అశోక్. అయితే ఈయన త్వరలో టాలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే.

భలేమంచి రోజు, శమంతకమణి, దేవదాసు వంటి సెక్సెస్‌ఫుల్‌ సినిమాలు తీసిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈయన దర్శకత్వంలోనే తొలిసారి జయదేవ్, అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేశారు. దీనికి పలువురు టాలీవుడ్ సినిమా ప్రముఖుల రానున్నట్లు సమాచారం.

ఇక ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

ఇటీవల ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ కొట్టిన భామ నిధి అగర్వాల్ అశోక్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించాడు.

రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండగా.. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Next Story