బ్రేకింగ్‌: గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగిని దారుణ హత్య

By సుభాష్  Published on  18 Feb 2020 4:31 PM GMT
బ్రేకింగ్‌: గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగిని దారుణ హత్య

తెలంగాణలోని గజ్వేల్‌లో దారుణం చోటు చేసుకుంది. బ్యాంకు ఉద్యోగిని దివ్య (25) దారుణ హత్యకు గురైంది. దివ్య ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తోంది. విధులు ముగించుకుని తన రూమ్‌కు వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడను కోసి దారుణంగా చంపేశారు. మృతురాలు స్వగ్రామం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట. కాగా, దివ్యకు ఈ నెల 26న వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోద చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it