నేటి నుంచి ఢిల్లీ మహిళలకు ఉచిత రవాణా..!
By సత్య ప్రియ Published on 29 Oct 2019 6:49 AM GMTమహిళల కోసం ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త పధకాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై మహిళలకు ప్రభుత్వ బస్సులు, క్లస్టర్ బస్సుల్లో ఉచిత ప్రయాణం లభించనుంది. ఢిల్లీ మెట్రో లో కూడా మహిళలకు ఈ సదుపాయం కల్పించనున్నారు. భాయ్ దూజ్ ను పురస్కరించుకొని, అక్టోబర్ 29 నుంచీ ఈ పథకం అమలు లోకి తీసుకొచ్చారు.
ఉచిత రవాణా సదుపాయం, మహిళలకు భద్రత కల్పించడమే కాకుండా ఢిల్లీ ఆర్ధిక వ్యవస్థలో మహిళల పాత్ర ను పెంచుతుంది.. అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు.
ప్రభుత్వ, క్లస్టర్ బస్సులలో ఎక్కే మహిళలకు పింక్ టికెట్లు ఇస్తారు, దీనికి ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ టికెట్లకు అయిన మొత్తాన్ని ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ భరిస్తుంది. ఇప్పటికే, డిటిసి డిపోలలో రూ.1.5 కోట్లు పింక్ పాసులు అందుబాటులో ఉన్నాయి.
అంతేకాకుండా, మహిళల భద్రత కోసం ప్రభుత్వ బస్సుల్లో ప్రస్తుతం నియమించిన 3400 మంది మార్షల్స్ ను 13 వేలకు పెంచనుంది ఢిల్లీ ప్రభుత్వం.