సినీప్రముఖుల, రాజకీయ నాయకుల పుట్టిన రోజులు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటారు. రక్తదానం, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపడుతుంటారు.  ఎవరికి తోచిన విధంగా.. వారికి చేతనైంతలో.. సాయం చేసి.. తమ నేతలపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుంటారు.

తాజాగా సోషల్‌మీడియాలో ఓ పోటో వైరల్‌ అవుతుంది. ఇంతకీ అందులో ఏం ఉందంటారా..? టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఫిబ్రవరి 17తో 66వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారన్న విషయం తెలిసిందే కదా. తమ అభిమాన నేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానంటూ ఓ వ్యక్తి ప్రకటించాడు. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ ఆకర్షిస్తోంది. ఆ ఆఫర్ ప్రకటించిన సెలూన్ షాపు యజమాని.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధికి చెందినవారుగా తెలుస్తోంది.  ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

ఇకపోతే కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని కేసీఆర్‌ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్