రెండు ప్రపంచ యుద్ధాల్లో పోరాడి.. కరోనా దాటికి తట్టుకోలేక..

By Newsmeter.Network  Published on  30 March 2020 8:41 AM IST
రెండు ప్రపంచ యుద్ధాల్లో పోరాడి.. కరోనా దాటికి తట్టుకోలేక..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంది. రోజురోజుకు ఈ వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా వైరస్‌ సోకి సుమారు 7లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతుండగా.. కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 32వేలకు చేరింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ భారిన పడి తాజాగా బ్రిటిన్‌కు చెందిన 108 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. హిల్డా చర్చిల్‌ అనే ఈ వృద్ధురాలికి ఓ ప్రత్యేక ఉంది. రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన అనుభవం ఉన్న ఈ వృద్ధురాలు.. స్పానిష్‌ ప్లూ వంటి భయంకరమైన వ్యాధులనుసైతం తట్టుకొని నిలిచింది. తాజాగా కరోనా వైరస్‌ ఈమె మరణానికి కారణమైంది.

Als0 Read :పీఎం కేర్స్‌కు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ 100 కోట్ల విరాళం

1918లో వచ్చిన స్పానిష్‌ ప్లూ వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా 5కోట్ల మంది మృతి చెందారు. ఆ సమయంలో హిల్డా చర్చిల్‌ ఉన్న ప్రాంతంలోనూ ఎంతో మంది మృత్యువాత పడ్డారు. కానీ ఆమె తట్టుకొని నిలిచింది. మరో వారం రోజుల్లో 109వ పుట్టిన రోజును జరుపుకొనేందుకు సిద్ధమవుతున్న ఈమెకు.. కరోనా సోకడంతో చికిత్స పొందుతూ ఆదివారం కన్ను మూసింది. బ్రిటన్‌లో కరోనా వైరస్‌ దెబ్బకు మృతిచెందిన అత్యంత వృద్ధిరాలిగా హిల్డా చర్చిల్‌ నిలిచింది. ఇదిలాఉంటే బ్రిటన్‌లో కరోనా వైరస్‌ భారిన పడి 19,522 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 1,228 మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం ఒక్క రోజే బ్రిటన్‌లో 2,433 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

Also Read :భారీగా దిగొచ్చిన బంగారం ధర

Next Story