ఇది మతిమరుపునకే కాదు.. అన్ని వ్యాధులను అడ్డుకుంటుంది

By సుభాష్  Published on  11 April 2020 12:37 PM IST
ఇది మతిమరుపునకే కాదు.. అన్ని వ్యాధులను అడ్డుకుంటుంది

మతిమరుపు అనేది చాలా మందిలో ఉంటుంది. వివిధ కారణాల చేత మతిమరుపు పెరుగుతోంది. కొందరికి టెన్షన్‌.. పని ఒత్తిడి.. ఎక్కువగా ఆలోచించడం వల్ల మతి మరుపు వస్తుంటుంది. అయితే మతిమరుపు ఉన్నవారు ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా మంచి పోషకాహారమైన పాలకూరలో ఎన్నో పోషకాలుంటాయి. అందులో లభించే ఫ్లేవనాయిడ్స్‌ మతిమరుపును పోగొట్టేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనల్లో తేలింది.

పాలకూరలో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అవి యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్లుగా పని చేస్తాయని పరిశోధకులు చెబుతున్న మాట. పాలకూరలో విటమిన్‌ సి, విటమన్‌ ఏ, మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయట. ఇక ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ దరిచేరకుండా ఎంతో అడ్డుకుంటుంది. గుండెకు సంబంధిత వ్యాధులు కూడా రాకుండా అడ్డుకుంటుంది. ఈ ఆకు కూరలో క్యాల్షియం, సోడియం, క్లోరిన్‌, ఫాస్పరస్‌, ఖనిజ లవణాలు, ఇనుము, విటమిన్‌-ఏ, విటమిన్‌-సి, ప్రోటీన్లు ఉంటాయి.

Forgetful Problem1

అంతేకాదు పాలకూరను ఎక్కువగా తీసుకునేవారిలో ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనలలో వెల్లడైంది. శరీరానికి అవసరమైన ఇనుమును పుష్కలంగా అందించనుంది పాలకూర. రక్తహీనత తగ్గించి, రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. పాలకూర వల్ల రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Next Story