ట్యాబ్లెట్స్‌ వేసుకున్న తర్వాత చల్లని నీరు తాగుతున్నారా..? అయితే జాగ్రత్త

By సుభాష్  Published on  7 April 2020 1:56 PM GMT
ట్యాబ్లెట్స్‌ వేసుకున్న తర్వాత చల్లని నీరు తాగుతున్నారా..? అయితే జాగ్రత్త

ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరూ ఏదో సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. మనం తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఉద్యోగ సమయాల్లో ఒత్తిళ్లు, వ్యాపార పరంగా టెన్షన్‌ ఇలా రకరకాలుగా కారణాలతో ఎంతో మందికి అనారోగ్యం దరి చేరుతోంది. దీంతో ఆస్పత్రుల పాలవుతుంటాము. ఇక అనారోగ్యం పడినప్పుడు వైద్యుని వద్దకు వెళ్లిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవడం తప్పని సరి. అయితే కొంత మంది ట్యాబ్లెట్స్‌ వేసుకున్న తర్వాత చల్లని నీటిని తాగుతుంటారు. కానీ ఇలా చల్లని నీరు తాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. మెడిసిన్‌ చక్కగా పని చేయాలంటే ఖచ్చితంగా గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.

కొందరు మందులు వేసుకున్న తర్వాత చల్లని నీటిని తాగడం వల్ల అది జీర్ణాశయంలోకి వెళ్లి వేడిగా అవుతుంది. ఈ క్రమంలో చల్లని నీటితో వేడిగా మార్చేందుకు శరీరంలో కొంత శక్తి ఖర్చవుతుంది. అంతేకాదు చల్లని నీటితో ట్యాబ్లెట్స్‌ వేసుకున్నప్పుడు అవి సరిగ్గా నీటిలో కరగవు. దీంతో శరీరంలో ట్యాబ్లెట్స్‌లో ఉండే మందుని శోషించుకోలేదు. ఈ కారణంగా ఇంకా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అందుకే ట్యాబ్లెట్స్‌ వేసుకున్న తర్వాత గోరు వెచ్చిని నీరుగానీ, గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని గానీ తాగాలి. దీని వల్ల మెడిసిన్‌ చక్కగా జీర్ణమై మందు పనితీరు బాగా పని చేస్తుందని చెబుతున్నారు. కాగా, ఆయుర్వేదంలో ఎన్నో మందులు, టానిక్‌లను తీసుకునే ముందు గోరు వెచ్చని నీటితోనే తీసుకోవాలని ముందే సూచిస్తారని, అందుకే ఏ మందులైన వాడే ముందు చల్లని నీరు కాకుండా గోరువెచ్చని నీరు తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట.

Next Story