గజేంద్రమోక్షంలో విష్ణుమూర్తి ఏనుగును ఎలా రక్షించాడో మనం విన్నాము. అయితే అటవీశాఖ అధికారులు నూతిలో పడిపోయిన ఏనుగులను ఎలా రక్షిస్తారో ఈ వీడియోలో చూడచ్చు. మాములుగా అడవుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ..ఇది జనసంచారంలో చోటుచేసుకుంది.

ఒడిస్సా రాష్ట్రంలోని సుందర్‌ఘాడ్‌ జిల్లాలో.. ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఓ ఏనుగు ప్రమాదావశాత్తు నూతిలో పడిపోయింది. దీంతో తన భారీ శరీరాన్ని ఎలా బయటికి తియ్యాలో దానికి అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక బాధగా రోధించింది. దీంతో ఆ ఏనుగు రోదనలు విన్న స్థానికులు తక్షణం అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆ ఏనుగు దీనస్థితిని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు ఆ ఏనుగును తాళ్ళతో కట్టి బయటకు తీసి రక్షించారు. ఏనుగు బయటకు రాగానే దట్టమైన అడవివైపు పరుగులుపెట్టింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.