కాలిఫోర్నియాలో కార్చిచ్చు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 4:35 PM GMT
కాలిఫోర్నియాలో కార్చిచ్చు..!

కాలిఫోర్నియాలో మరోసారి దావానలం చెలరేగింది. విపరీతమైన వేడిగాలుల కారణంగా అడవిలో కార్చిచ్చు రగిలింది. ఆ మంటలు దావాలనంలా మారి వేగం గా ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. అగ్ని కీలల ధాటికి భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిం ది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాలిఫోర్నియా కార్చిచ్చు దెబ్బకు వృక్షసంపదంతా కాలి బూడిదైపోతోంది. సుమారు 25 వేల ఎకరాల వన సంపద అగ్నికీలల్లో చిక్కుకుంది. గంటకు 137 కిలో మీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తున్నాయి. విపరీతమైన వేడిగాలులకు అగ్గి రాజుకొని సోనోమా ద్రాక్ష తోటల ప్రాంతం కాలిపోతోంది. అగ్నిమాపక సిబ్బంది, అధి కారులు మంటలను ఆర్పడానికి విపరీతంగా శ్రమిస్తున్నారు.

Next Story