వీసా గడువు పెంచిన కేంద్రం..హోంమంత్రిత్వ శాఖ వెల్లడి

By రాణి  Published on  13 April 2020 9:09 PM IST
వీసా గడువు పెంచిన కేంద్రం..హోంమంత్రిత్వ శాఖ వెల్లడి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ఐరోపా దేశాల్లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్న ఈ రాకాసి అమెరికాలో మాత్రం కరాళ నృత్యం చేస్తోంది. 6 లక్షలకు పైగా కేసులు..23 వేలకు చేరువలో మరణాలతో అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతోంది. కాగా..భారత్ కు వివిధ కారణాలతో వచ్చిన విదేశీయుల వీసా గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించగా..ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు కరోనా ప్రభావిత దేశాలన్నింటిలోనూ ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతోంది. విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో విదేశీయుల వీసా గడువును పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది.

Also Read : నడిరోడ్డుపై మద్యం పంపిణీ చేస్తూ టిక్ టాక్..ఆఖరికి ఇలా..

అలాగే కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు మంగళవారంతో ముగియనుంది. మరో వైపు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకూ పొడిగించాయి. ఈ తరుణంలో ప్రజలకు లాక్ డౌన్ పై నెలకొన్న సందేహాలను కేంద్రం ఈ విధంగా నివృత్తి చేసిందని చెప్పొచ్చు. విదేశీయుల వీసా గడువును 30వరకూ పెంచిందంటే..దేశంలో లాక్ డౌన్ గడువు అప్పటి వరకూ కొనసాగుతుందని కేంద్రం చెప్పకనే చెప్పింది.

రెండున్నర లక్షల భారత విద్యార్థులు యూనివర్శిటీలు, హాస్టళ్లు మూసివేయడంతో రోడ్డున పడ్డారు. వెంటనే కొంతమంది విద్యార్థులు తమ పరిస్థితిని అక్కడి భారత దౌత్య కార్యాలయానికి తెలపడంతో వసతితో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే వారి వీసా గడువులను కూడా పెంచేదిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Also Read : అమెరికాలో చిక్కుకున్న 2.50 లక్షల విద్యార్థులు

Next Story