వేరుశ‌న‌క్కాయ‌, మ‌ట‌న్ ముక్క‌ల్లో విదేశీ క‌రెన్సీ

By Newsmeter.Network  Published on  12 Feb 2020 12:22 PM GMT
వేరుశ‌న‌క్కాయ‌, మ‌ట‌న్ ముక్క‌ల్లో విదేశీ క‌రెన్సీ

అంతర్జాతీయ విమానాశ్రయాలు స్మగ్లింగ్‌కు అడ్డాగా మారుతున్నాయి. ఎయిర్‌పోర్టులో పటిష్టమైన నిఘా పెట్టినప్పటికీ.. సెక్యూరిటీ కళ్లుగప్పి స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు. కొత్త కొత్త పంథాల‌ను అనుస‌రిస్తూ గుట్టు చ‌ప్పుడు కాకుండా తమ ప‌ని కానిచ్చేస్తున్నారు. విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ చేస్తూ ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడు. ఆహార పదార్థాల్లో నోట్లు దాచి అక్రమంగా తరలిస్తుండగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు.

దుబాయ్‌కి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించడానికి మురద్ ఆలం అనే వ్యక్తి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క టెర్మినల్ -3 వద్దకు చేరుకున్నాడు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. వండిన మాంసం ముక్కలు, వేరుశెనగలు, బిస్కెట్ ప్యాకెట్లలో దాచిన విదేశీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటిని లెక్కించ‌గా రూ.45ల‌క్ష‌లు ఉన్న‌ట్లు సిఐఎస్ఎఫ్ ప్రతినిధి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ హేమేంద్ర సింగ్ తెలిపారు. “అక్రమ రవాణా కోసం విదేశీ కరెన్సీని దాచడానికి ఇది ఒక ప్రత్యేకమైన, విచిత్రమైన మార్గం” అని సింగ్ అన్నారు.



Next Story