ఒక్కలాటరీ..రోజువారీ కూలీని కోటీశ్వరుడిని చేసింది

By రాణి  Published on  12 Feb 2020 11:54 AM GMT
ఒక్కలాటరీ..రోజువారీ కూలీని కోటీశ్వరుడిని చేసింది

అతనొక రోజు వారీ కూలీ. కూలి పని చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. పైగా అప్పులు. నిండా బాధల్లో కూరుకుపోయిన అతడిని ఒక లాటరీ కాపాడింది. కేరళ రాష్ర్టం మలూర్ లోని తోలంబ్రా ప్రాంతం పురాలీమాల కైతాంచల్ కురీచయ కాలనీకి చెందిన పేరూనన్ రాజన్ (58) దినసరి కూలీ. ఏదొక రోజు అదృష్టం తలుపుతట్టకుండా ఉంటుందా అన్న నమ్మకంతో లాటరీ టికెట్లు కొనేవాడు. సడన్ గా రాజన్ కొన్న లాటరీ టికెట్ కేరళ క్రిస్టమస్ బంపర్ లాటరీలో రూ.12 కోట్లు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రాజన్ ముందు నమ్మలేదు. తర్వాత నిజమేనని తెలుసుకున్న రాజన్ ఆశ్చర్యపోయాడు. ఇంతపెద్ద మొత్తంలో తనకు లాటరీ వస్తుందనుకోలేదని ఉద్వేగానికి లోనయ్యాడు. లాటరీ వచ్చాక రాజన్ తన భార్య రజనీ, కుమారుడు రిజిల్, కుమార్తె అక్షరలతో కలిసి కన్నూర్ జిల్లా సహకార బ్యాంక్ కు వెళ్లి అక్కడి అధికారులకు టికెట్ చూపించాడు. కూతుపరంబ పట్టణంలో తాను లాటరీ టికెట్టు కొన్నట్లు తెలిపాడు. రూ.12 కోట్ల లాటరీకి గాను పన్నులు పోనూ తనకు రూ.7.2 కోట్లు వస్తాయని బ్యాంక్ అధికారులు తెలిపారు.

లాటరీలో తనకు వచ్చిన నగదుతో ఉన్న అప్పులు తీర్చి పిల్లలను చదివిస్తానని, తనకు గతంలో సహాయపడిన వారికి తాను సహాయం అందిస్తానని చెప్పుకొచ్చాడు.

Next Story