ఒక్క చుక్క డ్రింక్‌ కోసం ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 7:14 AM GMT
ఒక్క చుక్క డ్రింక్‌ కోసం ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు

ఒక్క చుక్క జ్యూస్ కోసం ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు ఓ బాలుడు. తనకిష్టమైన జ్యూస్ లాస్ట్ డ్రాప్ కోసం బాటిల్ లోకి నాలుక దూర్చేసాడు. అంతే.. బాటిల్ లో నాలుక ఇరుక్కుపోయింది. నాలుక బయట తీయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన రాకపోవడంతో తల్లిదండ్రులు చివరికి బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు అతి చాకచక్యంగా బాటిల్ నుంచి పిల్లవాడు నాలుకను బయటకు తీశారు. బాలుడి నాలుక లోపలికి పెట్టినప్పుడు బాటిల్ల్ లో గాలి బయటకు రిలీజ్ అయి పోయి అందులో వేక్యూమ్ ఏర్పడింది. ఈ కారణంగానే నాలిక బాటిల్ లో ఉండిపోయింది. దీంతో బాటిల్ లో ఏర్పడిన ఖాళీలో గాలిని నింపేందుకు ఇంజక్షన్ సిరంజ్ ను ఉపయోగించారు.

ఇంతకీ డాక్టర్లు ఉపయోగించిన ఆ టెక్నిక్ ఏంటో తెలుసా.. వైన్ బాటిల్ ని వైన్ ఓపెనర్ లేకుండా సిరంజీ తో ఓపెన్ చేసి టెక్నీక్.. మొత్తానికి నాలుక బయటకు వచ్చింది. అయితే నాలుకకు రక్తప్రసరణ అందకపోవటంతో నాలుక నీలంగా మారిపోయింది. వైద్యులు బాధితుడిని 24 గంటల పాటు తమ సంరక్షణలో ఉంచి చికిత్స అందించారు. అయితే ఈ బాలుడి నాలుక పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి 2 వారాలు పడుతుందట. ఈ సంఘటన జర్మనీ లోని హానోవర్ లో చోటు చేసుకుంది.

Tongue Tied Whe 431440

Next Story