మొట్టమొదటి టెక్ట్స్ మెసేజ్‌కు 27 ఏళ్లు.. ఎప్పుడు.. ఎవరు.. ఎవరికి పంపారో తెలుసా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Dec 2019 8:03 PM ISTరోజూ వందల మెసేజ్‌లు రిసీవ్ చేసుకునే మనం.. అసలు మొట్టమొదటి మెసేజ్ ఎప్పుడు పంపారో తెలుసుకునే ప్రయత్నం చేసామా..? చేసుండము. నెట్‌వర్క్ సర్వీసుల చలవతో రోజుకు వందల మెసేజ్‌లతో బిజీగా ఉండే మనం.. అసలు మొదటి ఎవరికి ఎవరు పంపారో తెలుసుకుందాం.
మొట్టమొదటి ఎస్ఎంఎస్(మెసేజ్) పంపి ఈ రోజుకు సరిగ్గా 27 ఏళ్లు పూర్తయ్యాయి. 1992వ సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన మొదటి టెక్ట్ మెసేజ్‌ను పంపారు. వొడాఫోన్ సంస్థకు చెందిన ఇంగ్లాండ్ డైరెక్టర్ రిచర్డ్‌కు.. ఇంజనీర్ నెయిల్ పాప్‌వర్త్ మొట్టమొదటి టెక్ట్స్ మెసేజ్ పంపాడు.
నెయిల్ పాప్‌వర్త్.. 'మెర్రీ క్రిస్టమస్' అనే విషెష్ మెసేజ్‌ను తొలిసారిగా తన పై అధికారికి పంపించారు. అయితే.. పాప్‌వర్త్ ఆ మెసేజ్ పంపిన సమయంలో సెల్ ఫోన్లకు ఇంకా కీబోర్డులు లేవు. పాప్‌వర్త్.. ఆ మేసేజ్‌ని కంప్యూటర్‌లో టైప్ చేసి మొబైల్ ద్వారా ఆ సందేశాన్ని పంపించారు.
అయితే పాప్‌వర్త్.. ఆ మెసేజ్ పంపినప్పుడు రిచర్డ్ క్రిస్టమస్ పార్టీలో ఉన్నారంట. పార్టీ అనంతరం తనకు అందిన మెసేజ్ ను చూసుకొని చాలా ఆశ్చర్యానికి గురయ్యాడట. ఆ తర్వాత మొదటి మెసేజ్ ను అందుకున్న రిచర్డ్.. తన అనుభూతుల్ని మీడియాతో పంచుకున్నాడు.
ఇప్పుడంటే.. మెసెజ్‌ల మీద విరక్తి ఎక్కి ఉన్నాం కానీ మనం.. రెండు దశాబ్దాల క్రితం టెక్ట్స్ మెసేజ్‌లకు అంత ప్రాధాన్యం ఉండేది. సంవత్సరాలు గడిచిన కొద్ది.. వాట్సాప్, వుయ్ చాట్, వైబర్ వంటి ఆన్‌లైన్ మెసెంజర్‌లు వచ్చాక టెక్ట్స్ మెసేజ్‌ల ప్రాధాన్యం తగ్గిపోయిందనే చెప్పాలి.