'రొమాంటిక్' సెట్ లో అగ్నిప్ర‌మాదం.. ఎలా జ‌రిగింది..?

By Medi Samrat  Published on  15 Oct 2019 12:02 PM GMT
రొమాంటిక్ సెట్ లో అగ్నిప్ర‌మాదం.. ఎలా జ‌రిగింది..?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.. క‌థ‌, మాట‌ల‌తో రూపొందుతోన్న చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమాలో పూరి త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్నారు. 'పూరి - ఛార్మి' సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి కొత్త ద‌ర్శ‌కుడు అనిల్ పాడూరి ద‌ర్శ‌కుడు. అయితే... ఈ సినిమా సెట్స్ లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది.

సాంగ్ షూట్ కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ ప్ర‌మాదం జ‌రగ‌డంతో కర్టెన్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే యూనిట్ సభ్యులు మంట‌ల్ని ఆర్పేయ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ఆకాష్ పూరి హీరోగా న‌టించిన 'మెహ‌బూబా' సినిమా ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో 'రొమాంటిక్' మూవీ పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. దాదాపు 70% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా అయినా ఆకాష్ కి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

Next Story
Share it