హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం
By Newsmeter.Network Published on 14 May 2020 5:31 AM GMT
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి వేళ ఒక్కసారిగా మటలు వ్యాపించాయి. రాత్రి 2గంటల తరువాత మంటలు వ్యాపించడంతో అక్కడి సిబ్బంది గమనించి అదుపుచేసే ప్రయత్నం చేశారు. కానీ మంటలు అంతకంతకు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో చెట్లు కాలిబూడిదయ్యాయి. పలు జంతువులు మంటల దాటికి మృతిచెందినట్లు తెలుస్తోంది. భారీగా అగ్నికీలలు ఎగిసిపడటంతో రాత్రి సమయంలో యూనివర్సిటీ సిబ్బంది ఫైరింజన్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.
Also Read :బస్సు, ట్రక్కు ఢీకొని వలస కూలీలు మృతి
కాగా అప్పటికే మంటల వ్యాప్తిపెరగడంతో అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. యూనివర్సిటీ ప్రాంగణంలో భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు అదుపులోకి రావటంతో ఊపిరిపీల్చుకున్నారు.