విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. 50 బైక్‌లు.. 10 కార్లు..
By అంజి Published on 25 Jan 2020 6:25 PM ISTవిశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లోని వరుణ్ మోటార్స్ సర్వీసింగ్ సెంటర్‌లో మంటలు భారీగా చేరాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ఉద్రిక్తత తీవ్రతరం కావడంతో మరో మూడు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 10 కార్లు, 50 బైక్‌లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మొన్న రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవునిపల్లి సమీపంలో పాడైపోయిన రబ్బర్ టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో పెద్ద ఎత్తున మండలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ప్లాస్టిక్ గోదాంకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ప్రమాద స్థలానికి చేరుకున్న సిబ్బంది, ఐదు అగ్నిమాపక శకటాలతో వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా, ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గోదాం నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.