ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

By సుభాష్  Published on  15 May 2020 10:47 AM GMT
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

లాక్‌డౌన్‌ సడలింపులతో తెరుచుకున్న పరిశ్రమల్లో గ్యాస్‌లీకేజీ, అగ్ని ప్రమాదాలు తరచూ చోటు చేసుకోవడం తీవ్ర కలంలకం రేపుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలో అగ్నిప్రమాదాలు చేసుకుంటున్నాయి. తాజాగా ఏపీలోని ఒంగోలులో మినో ఫామ్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు.

పేర్నమిట్ట సమీపంలో మినో ఫామ్‌ ఔషద పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు శానిటైజర్‌లు తయారు చేస్తుండగా, అందులో వినియోగించే ఆల్కహాల్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పరిశ్రమలోని రెండో అంతస్తులో దట్టమైన పొగలు తీవ్రంగా వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి.

ఈ ఫార్మా కంపెనీలో శానిటైజర్లు తయారీకి ఉ పయోగించే అల్కహాల్‌ ఉంటుంది. రెండో అంతస్తులో ఏసీలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఆ పక్కనే ఉన్న అల్కహాల్‌కు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఏసీలో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.

Next Story