కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పదుల సంఖ్యలో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2020 7:10 AM GMT
కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పదుల సంఖ్యలో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌లు

కరీంనగర్‌ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్‌పీడీసీఎల్‌ కార్యాలయం సమీపంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్‌లో శనివారం భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఈ మంటల్లో పదల సంఖ్యలో ఉన్న కొత్త ట్రాన్స్‌ఫార్మార్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే.. అప్పటికే భారీగా నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీశారు. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు.

Next Story
Share it