కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు కరోనా బాధితులు మృతి

By సుభాష్  Published on  12 May 2020 10:45 AM GMT
కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు కరోనా బాధితులు మృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాలో విషాదం చోటు చేసుకుంది. సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి ఐదుగురు కరోనా బాధితులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా, వారిని హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించినట్లు రష్యాన్ అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా ఐసీయూ వార్డులో ఓ వెంటిలేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.

అగ్ని ప్రమాదం సంభవించగానే ఆస్పత్రి సిబ్బంది దాదాపు 200 మంది వరకూ కాపాడి చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది శకటాలతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు మృతి చెందారు.

కాగా, రష్యాలో ఇప్పటి వరకూ 232,245 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 43,515 మంది కోలుకున్నారు. ఇక 2, 118 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,86,715 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే వీరిలో 2400 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it