భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు
By సుభాష్ Published on 29 Feb 2020 5:29 PM IST
చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మాధవరం సమీపంలో ఓ ఆయిల్ తయారీ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయిల్ తయారీ కేంద్రం కావడంతో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు తీవ్రతరం కావడంతో పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ఒకవైపు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతుంటే మరో వైపు మంటలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story