యంగెస్ట్ పీఎంగా రికార్డ్‌..!

By జ్యోత్స్న  Published on  10 Dec 2019 4:21 AM GMT
యంగెస్ట్ పీఎంగా రికార్డ్‌..!

34 ఏళ్లకి ఎవరైనా ఓ మంచి ఉద్యోగం చేస్తారు అదే రాజకీయాల్లో అయితే ఏదో ఒక చిన్న పదవితో సరిపెట్టుకుంటారు. కానీ అమ్మాయి ఎంచక్కా 34 ఏళ్ళ కే ఏకంగా ఒక దేశానికి ప్రధానమంత్రి అయింది. ఆమె పేరు సన్నా మారిన్. ఫిన్లాండ్ కు కాబోయే ప్రధాని. సన్నా మారిన్‌ ప్రపంచంలోనే అతిపిన్న వయస్సులోనే ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మాజీ ప్రధాని అంటి రిన్నే.. దేశంలో పోస్టల్ సమ్మెను సరిగా నియంత్రించలేకపోవడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సన్నా మారిన్ ను 46 వ ప్రధానిగా ఎన్నుకుంటూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Qlcsww9

ఫిన్లాండ్ ప్రధాని కోసం జరిగిన ఓటింగ్ లో మారిన్ మాజీ ప్రధాని అంటీ రీనేపై అతి తక్కువ ఓట్ల తేడాతో ఈమె విజయం సాధించింది. మారిన్ త్వరలో ప్రధాని బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్ డెర్న్ వయసు 36ఏళ్లు కాగా, ఉక్రెయిన్ ప్ర‌ధాని ఒలేక్క్‌సీ హోంచార్కు 35 ఏళ్లు. 1991లో ఫిన్ లాండ్ ప్రధానిగా ఎన్నికైన 36 ఏళ్ల ఏ ఎస్కో హో రికార్డను సన్నా మారిన్ బ్రేక్ చేసింది.

Next Story