ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాను ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం గదిలో వేసి నిర్బంధించింది. డీఎంవో సుల్తానా కొవిడ్ లక్షణాలతో చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 24 గంటలకు చికిత్స ఖర్చును ఆస్పత్రి యాజమాన్యం రూ. 1.15 లక్షల బిల్లు వేసింది. బిల్లు అంత ఎందుకు వేశారని అడిగితే తనను నిర్భందించారని సెల్ఫీ వీడియోలో సుల్తానా పేర్కొన్నారు.