ఇలాంటి సెలవులే మళ్లీ మళ్లీ రావాలి!!

By సుభాష్  Published on  6 Jan 2020 6:34 AM GMT
ఇలాంటి సెలవులే మళ్లీ మళ్లీ రావాలి!!

కొత్త క్యాలెండర్ రాగానే అధికారిక సెలవులు ఎప్పుడున్నాయా అని చూడటం మనందరికీ అలవాటు. ఈ సారి ఒక శుభవార్త ఏమిటంటే మొత్తం 23 అధికారిక పండుగల్లో ఏడు పండుగలు శనివారం వస్తున్నాయి. అంటే ఆ తరువాత ఆదివారం రోజు కూడా సెలవే కావడంతో ఉద్యోగులకు రెండు రోజులు వరుసగా సెలవు వచ్చినట్టు అవుతుంది. బక్రీద్ (ఆగస్టు 1), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), వినాయక చవితి (ఆగస్టు 22), దుర్గాష్టమి (అక్టోబర్ 24), బతుకమ్మ ప్రారంభం (అక్టోబర్ 17), బాక్సింగ్ డే (డిసెంబర్ 26) లు ఆదివారం రోజే వస్తున్నాయి. అదే విధంగా హోలీ, ఈదుల్ ఫితర్, బోనాలు, గురుపూర్ణిమ లు సోమవారం నాడు జరుగుతాయి. అంటే ముందు రోజు ఆదివారం కావడంతో రెండు రోజుల పాటు సెలవులు అనుభవించవచ్చు. ఇక క్రిస్మస్ అయితే మూడు రోజులు సెలవు వరుసగా దొరుకుతుంది. క్రిస్మస్ శుక్రవారం నాడు, బాక్సింగ్ డే శనివారం పడగా, ఆ తరువాతి రోజు ఆదివారం.

ఇలాగే వారానికి అయిదు రోజులే పనిచేసే వారికి శుక్రవారం రోజున పండుగ ఉంటే శని, ఆదివారాలు కలిసి వస్తాయి. అంటే వరుసగా మూడు రోజులు సెలవులన్నమాట. అలా హోలీ, మహా శివరాత్రి, గుడ్ ఫ్రైడే, గాంధీ జయంతి, క్రిస్మస్, మిలాదున్నబీలు శుక్రవారం నాడు వస్తున్నాయి. అంటే ఆరు సార్లు ఏకబిగిన మూడు రోజుల చొప్పున సెలవులు దొరుకుతాయి.

అయితే క్యాలెండర్ కొన్ని చోట్ల కటువుగా కూడా వ్యవహరించింది. అయిదు ప్రధాన సెలవు దినాలు ఆదివారం లేదా రెండో శనివారం నాడు వస్తున్నాయి. దీని వల్ల సెలవు ఉన్నా లాభం లేదు. గణతంత్ర దినోత్సవం (జనవరి 26), బాబూ జగజీవన్ రామ్ జయంతి (ఏప్రిల్ 5), మొహర్రం (ఆగస్టు 30), విజయదశమి (అక్టోబర్ 25), దీపావళి (నవంబర్ 14) లు ఆదివారం నాడు వస్తున్నాయి. ఈ అయిదు రోజులూ ఉద్యోగులకు పోయినట్టే!!

Next Story