మీరు ఇండియన్స్ అయితే వాలెంటైన్స్ డే జరుపుకోకండి..!

By రాణి  Published on  23 Jan 2020 9:16 AM GMT
మీరు ఇండియన్స్ అయితే వాలెంటైన్స్ డే జరుపుకోకండి..!

మీరు నిజంగా ఇండియన్స్ అయితే వాలెంటైన్స్ డే జరుపుకోకండి. ఎందుకంటే అది మన సాంప్రదాయం కాదు. బ్రిటీష్ వారు ఇక్కడ వదిలేసి వెళ్లి కల్చర్ కు అలవాటుపడినంత మాత్రాన వారికి సంబంధించిన పండుగలన్నీ మనం జరుపుకోవాలన్న రూల్ లేదు కదా..1947లో మనకు స్వాతంత్ర్యం లభించినప్పటికీ ఇప్పటి వరకూ ఆంగ్ల సంవత్సరాదినే మనం న్యూ ఇయర్ గా జరుపుకుంటున్నాం గానీ..నిజానికి అసలైన తెలుగు సంవత్సరాది ఉగాదితోనే కదా మొదలయ్యేది. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ న్యూ ఇయర్ నే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటైపోయింది.

ఇక ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకోవద్దనే కదా మీ సందేహం. ఆ రోజును ఇండియన్ ఆర్మీ గతేడాది బ్లాక్ డే గా ప్రకటించింది. గతేడాది జమ్మూ కశ్మీర్ లోని నేషనల్ హైవే 44 పై 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లతో ఆగి ఉన్న కాన్వాయ్ ని ఉగ్రవాదులు ఒక కార్ లో ఆర్డీఎక్స్ పెట్టి పేల్చివేశారు. ఈ హృదయవిదారక ఘటనలో 40 మంది ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. అప్పుడే ఇండియన్ ఆర్మీ ఫిబ్రవరి 14ను బ్లాక్ డే గా ప్రకటించింది.

ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఫిబ్రవరి 26,2019 న బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలను యుద్ధవిమానాల సహాయంతో కూల్చివేసింది. ఈ ఘటనలో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది.

భజరంగ్ దళ్ కూడా ఫిబ్రవరి 14కు వ్యతిరేకమే. ఆరోజు ఎక్కడైనా వయసులో ఉన్న అమ్మాయి - అబ్బాయి వారి కంట పడ్డారా..అంతే సంగతులు. వారిద్దరి మధ్య ఉన్నది రక్త సంబంధమా..ప్రేమ బంధమా అనేది కూడా ఆలోచించరు సరి కదా...కనీసం వారిని ప్రశ్నించకుండానే పెళ్లిళ్లు చేసేస్తారు. గతంలో ఇలాంటి ఘటనలెన్నో ఉన్నాయి.

అమరుల త్యాగాన్ని కాదని..మనం ప్రేమికుల రోజును జరుపుకుంటే...వారి త్యాగాన్ని మనం విలువనివ్వట్లేగా.. ''ఇండియా బోర్డర్ లో నిలబడి ఆర్మీ జవాన్లు కాపాడుకుంటున్న ప్రాణాలు మనం. బాధ్యత లేకపోతే ఎలా ?'' ఇది కేవలం మహేశ్ బాబు సినిమా డైలాగ్ మాత్రమే అనుకుంటే పొరపాటే.

40 మంది జవాన్లు వీరమరణం చెందారని తెలియగానే...యావత్ భారతానికి ఎక్కడలేని దేశభక్తి గుర్తుకొచ్చింది. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఒకటేంటి..అన్ని సోషల్ మీడియా వేదికల్లోనూ ఆర్మీ జవాన్లకు నివాళులు అర్పించనివారు లేరు. నిజంగా మనకు దేశభక్తి ఉంటే..సంవత్సరంలో వారి కోసం ఒక్క రోజును త్యాగం చేయలేమా..? ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ను జరుకోకుండా ఉండలేమా ? ప్రేమికులూ...ఆలోచించండి...ప్రేమ కన్నా త్యాగం గొప్పది.

Next Story