ఈ లోకంలో మంచివాళ్లు, చెడ్డ‌వాళ్లు ఉంటారేమోగానీ.. బాధ్య‌త లేని తండ్రి ఉండ‌రు

By సుభాష్  Published on  20 Jun 2020 1:55 AM GMT
ఈ లోకంలో మంచివాళ్లు, చెడ్డ‌వాళ్లు ఉంటారేమోగానీ.. బాధ్య‌త లేని తండ్రి ఉండ‌రు

'గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకొనే వ్యక్తి..

ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే..

అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి నానొక్కడే.'

మనలో జీవాన్ని నింపి.. అల్లారుముద్దుగా పెంచి.. మనలో లోపాలను సరి చేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, మన గమ్యం చూపేది నాన్న.. అనురాగానికి రూపం నాన్న.

ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివెళ్లే ‘నాన్న’...ఇంటిపట్టున ఉండలేడు...కంటి నిండా నిద్రపోలేడు. ఇంటి బాధ్యతలను తన భుజానా మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తుంటాడు. పిల్లల భవిష్యత్తు నిరంతరం తాపత్రయ పడతాడు. అటువంటి నాన్నకు కూడా అమ్మతో సమానమైన గుర్తింపు ఉండాలనే తలంపుతో 1910 జూన్‌లో మూడో ఆదివారం తొలిసారిగా ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్స్‌ డే ఎలా వచ్చిందో తెలుసుకుందాం..!

ఒక అమ్మాయికి వచ్చిన ఆలోచనతోనే ‘ఫాద‌ర్స్ డే’

పిల్లలను కనిపెంచే తల్లిదండ్రులు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటారు. తల్లిదండ్రులిద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పటికీ తల్లికి లభించిన గుర్తింపు తండ్రికి లభించడం లేదని భావించి.. తండ్రి పాత్రకు తగిన గుర్తింపుకోసం ఒక కూతురు పడిన తపన నుంచి పుట్టిందే ఈ ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం). ఈ ఫాదర్స్‌ డేను ప్రత్యేకంగా నిర్వహించుకోవాలని తొలిసారిగా గుర్తించి.. ఆ దిశగా ప్రయత్నాలు చేసింది వాషింగ్టన్‌కు చెందిన ‘సొనారా’. ఈ విషయంలో ఆమె ఎంతగానో పోరాడి ఫాదర్స్‌ డే ఏర్పాటయ్యేలా చేసింది. ఈ ఉత్సవాలను మొదలుపెట్టింది అమెరికా అయినప్పటికీ కాలక్రమేణా అన్ని దేశాలకు పాకింది.

సొనారా కుటుంబం..

హెన్నీ జాక్సన్ స్మార్ట్, విలియమ్ స్మార్ట్ దంపతులు వాషింగ్టన్‌లోని ‘స్పొకనే’ అనే గ్రామంలో జీవనం కొనసాగించే వారు. ఆ దంపతులకు మొత్తం ఆరుగురు పిల్లలు. అందులో చివరి సంతానం సొనారా. సోనారాకు ఆరునెలల వయసు ఉన్నప్పుడే తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందింది. ఇది 1895 పరిస్థితి. అయితే అప్పట్లో పురుషుడు విలియమ్‌కు మరో భార్య తెచ్చుకునే హక్కులుండేవి. కానీ ఆయన తండ్రి పాత్రకు న్యాయం చేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడ్డాడు. వ్యవసాయం చేస్తూనే తన బిడ్డలకు తల్లిలేని లోటు తీర్చాడు. ముఖ్యంగా ఆరు నెలల పాప సోనారాకు ఆయనే తల్లి, తండ్రి. తల్లిలేని లోటు తీర్చేవాడు. అయితే తల్లి ఉంటుందని కూడా ఆ వయసులో ఆ చిన్నారికి తెలిసేది కాదు. ఆమెకు తెలిసింది ఒక్కటే అన్ని విధాలుగా కంటికిరెప్పలా చూసుకునే తండ్రి మాత్రమే. ఇక సోనిరా 27 రాగానే ఆమె ఓ ఆలోచన వచ్చింది. తండ్రులందరితో తన తండ్రే అత్యుత్తముడని భావించింది. ఆయన పుట్టిన రోజునే తండ్రుల దినోత్సవంగా జరుపుకోవాలని ఆమె భావించింది. ఇది చదవండి: ఆ నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌

అయితే తండ్రి జన్మించింది జూన్. జన్మించిన తేదీ సరిగ్గా తెలియకపోయినా జూన్‌లో ఏదో ఒకరోజు తండ్రి జన్మదిన వేడుకలు జరపాలని భావించింది. ఆ నెలలో ఆ గ్రామంలో అందరిని ఓ రోజు ఆహ్వానించింది. ఇది కేవలం నా తండ్రి పుట్టిన రోజు కాదని, తండ్రులు పోషించే పాత్రను సమాజానికి, ఇతర పిల్లలకు తెలియజేసే రోజని, అందుకే ఈ రోజును ఆదర్స్‌ డేగా జరుపుకొందామని సోనారా ప్రకటించింది. ఈ విషయం అందరికి నచ్చడంతో అప్పటి నుంచి ఫాదర్స్‌ డే ఆ గ్రామంలో వేడుకలు నిర్వహించడం ప్రారంభమైంది. తర్వాత ఇది చుట్టుపక్కల గ్రామలన్నింటికీ పాకింది.

సోనారా పోరాట ఫలితంగానే ఫాదర్స్‌ డే

తల్లుల కోసం ఓ రోజు కేటాయించినప్పుడు తండ్రుల కోసం ఎందుకు కేటాయించకూడదని ఆమె తన పోరాటాన్ని ప్రారంభించింది. ఈ పోరాట ఫలితంగా 1910 జూన్‌ 19న ప్రపంచంలో తొలిసారిగా అమెరికాలో ఫాదర్స్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే నిజానికి ఆమె జూన్ 5న ఈ వేడుకలను నిర్వహించాలని భావించినా.. కొన్ని కారణాల వల్ల జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌ డేగా నిర్ణయించారు. ఈ ఫాదర్స్‌ డేను 1916లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ దీన్ని అధికారికంగా ఆమోదించారు. 1966లో జూన్ మూడో ఆదివారం ఫాదర్స్‌ డే జరుపుకోవాలంటూ దీనికి సంబంధించిన తీర్మానంపై అధ్యక్షుడు ‘లిండన్ జాన్సన్’ సంతకాలు చేశారు. తర్వాత దీన్ని నిర్వహించేందుకు శాశ్వత జాతీయ ప్రతిపత్తిని రిచర్డ్ నిక్సన్ కల్పించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫాదర్స్‌ డే ప్రసిద్ధి చెందింది. ఇది చదవండి: పక్కా ప్లాన్‌ ప్రకారమే భారత్‌పై చైనా దాడి

Next Story