హత్రాస్ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. ముఖ్యంగా పోలీసుల తీరు కూడా పలు అనుమానాలను తావిస్తోంది. ఇలాంటి తరుణంలో యూపీ ప్రభుత్వం హత్రాస్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదిక ఆధారంగా దుర్వినియోగ ఆరోపణలపై వీరిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది. నిందితులతో సహా బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్‌ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిట్‌ బృందం కోరింది. బాధితురాలి మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేయడంపై కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. దోషులను ఉరితీయాలని.. యూపీ సీఎం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

https://web.archive.org/web/20201002135450/https://www.facebook.com/permalink.php?story_fbid=2485111241792661&id=100008814274485

ఇలాంటి సమయంలో హత్రాస్ నిందితుల్లో ఒకరైన సందీప్ తండ్రి ప్రముఖ బీజేపీ నాయకుడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. పలువురు ప్రముఖ బీజేపీ నాయకులతో ఉన్న ఓ వ్యక్తిని నిందితుల్లో ఒకరైన సందీప్ తండ్రి అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ఉన్నారు. ఈ కారణం చేతనే పోలీసులు కేసును తప్పుదావ పట్టించాలని అనుకుంటూ ఉన్నారని.. పోస్టులు చేస్తూ ఉన్నారు. హిందీ-ఇంగ్లీష్ భాషల్లో ఈ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్ నాథ్ సింగ్ లతో సదరు వ్యక్తి ఉన్న ఫోటోలు వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం.

ఫోటోల్లో ఉన్న వ్యక్తి హత్రాస్ కేసులో నిందితుడైన సందీప్ అనే వ్యక్తి తండ్రి కాదు. ఆయన పేరు ‘డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ద్వివేది’, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ కు చెందిన బీజేపీ నేత.

ఈ ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫోటోల్లో ఉన్న వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ఫోటోను Bolta Hindustan అనే వెబ్ సైట్ ఆర్టికల్ లో ఉంచారు. డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ద్వివేది.. కాశీ ప్రావిన్స్ యువ మోర్చా ఆఫ్ భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నాడు. ప్రయాగరాజ్ కు చెందిన బి.ఏ. చదువుతున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సెప్టెంబర్ 16, 2020న కథనాన్ని వెల్లడించారు.

DNA లో కూడా ఈ ఘటన గురించి కథనాలు రాసుకుని వచ్చారు. ప్రయాగరాజ్ పోలీసులు భారతీయ జనతా పార్టీ నేత, డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ద్వివేది బి.ఏ.చదువుతున్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు రిజిస్టర్ చేశారు. పలువురు రాజకీయ నాయకులతో అతడికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో పలువురు బీజేపీ నాయకులతో తీసుకున్న ఫోటోలను కూడా అతడు ఉంచాడు.

హత్రాస్ కేసులో నిందితుడైన సందీప్ తండ్రికి సంబంధించిన సమాచారం కోసం న్యూస్ మీటర్ క్రాస్ చెక్ చేసింది. ఇండియా టుడే రిపోర్టుల ప్రకారం సందీప్ తండ్రి పేరు నరేంద్ర.

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న వ్యక్తికి హత్రాస్ ఘటనతో ఎటువంటి సంబంధం లేదు. అతడి మీద వేరే ఘటనకు సంబంధించి అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి.

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న వ్యక్తి.. హత్రాస్ ఘటనలో నిందితుడైన సందీప్ తండ్రి అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet