తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on
16 Oct 2019 1:23 PM GMT

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. బుద్ధబిక్షం అనే రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యకు యత్నించిన రైతు బుద్ధబిక్షం పడమటిగూడెం గ్రామానికి చెందిన వాసి. తనకున్న 11 ఎకరాల భూమిని తన ప్రమేయం లేకుండా అధికారులు వేరొకరికి పట్టా చేశారంటూ రైతు బుద్ధ బిక్షం ఆరోపణలు చేశాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. అధికారులు స్పందించాలంటూ రైతు బిక్షం డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతు బుద్ధబిక్షంను కిందకు దించిని తగిన న్యాయం చేస్తామని సర్ది చెప్పారు.
Next Story