వెంకీమామ.. ఏంటి మాకు ఈ టెన్ష‌న్ - ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 12:38 PM GMT
వెంకీమామ.. ఏంటి మాకు ఈ టెన్ష‌న్ - ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య కాంబినేషన్‌లో రూపొందుతోన్నభారీ క్రేజీ మూవీ 'వెంకీమామ‌'. ఈ సినిమాని జైల‌వ‌కుశ ఫేమ్ బాబీ తెర‌కెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్స్ కి వ‌స్తుందా అని ప్రేక్ష‌కాభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

అయితే.. చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌లేదు. ద‌స‌రాకి వ‌స్తుంది అనుకున్న ఈ సినిమా రాలేదు. ఆత‌ర్వాత దీపావ‌ళి అన్నారు అది కూడా వెళ్లిపోయింది. ఆత‌ర్వాత సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు సంక్రాంతికి పోటీ ఎక్కువుగా ఉండ‌డం వ‌ల‌న డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డం బెస్ట్ అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే... ఈ సినిమా టీమ్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న త‌మ‌న్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...త్వ‌ర‌లో వెంకీమామ ఫ‌స్ట్ సింగిల్ రానుంది అని తెలియ‌చేశారు కానీ.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం చెప్ప‌లేదు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎప్ప‌టి నుంచో రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది చెప్ప‌కుండా ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అంటూ ఈ హ‌డావిడి ఏంటి అంటూ త‌మ‌దైన శైలిలో ఫైర్ అవుతున్నారు అభిమానులు. మ‌రి... త్వ‌ర‌లోనే వెంకీమామ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Next Story