విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
By సుభాష్Published on : 19 Jun 2020 9:40 AM IST

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుణెలోని సుఖ్‌సాగర్ ఏరియాలో ఓ కుటుంబం జీవిస్తోంది. ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపిన దంపతులు.. ఆ తర్వాత వారు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న పోలీసలు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read
ఉత్తరప్రదేశ్‌లో మరో నిర్భయ..!Next Story