అనుమానపు కలహాలు.. బలైన కుటుంబం..!
By Newsmeter.Network
వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిద్రపోతున్న భార్య, కూతురుతో పాటు తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ దారుణం చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో జరిగింది. బడికల జయన్న కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో నివసిస్తున్నాడు. కూతురు గాయత్రి కొల్లాపూర్ పట్టణంలో ఇంటర్ చదువుకుంటోంది, భార్య వరలక్ష్మీ అదే గ్రామంలో అంగన్‌వాడీ టీచర్ చేస్తోంది. గత కొన్ని రోజులు జయ్యన్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈనేపథ్యంలో కుటుంబంలో తరచు గొడవలు పడేవారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో విసిగిపోయిన జయన్న బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో భార్య, కూతురుతో పాటు తనపై పెట్రోల్ పోసుకొని నిప్పింటించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారని వెంటనే కొల్లపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందతూ బడికల జయ్యన్న (40), కూతురు గాయత్రి (17) మృతి చెందారు. భార్య వరలక్ష్మీ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.