FactCheck : శేష్ నాగ్ సరస్సు మధ్యలో మహాసర్పం కదులుతూ కనిపించిందా?

Viral Video On Social Media Saying Sesh Nag In The Lake. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే దారిలో శేష్ నాగ్ అనే సరస్సులో మహా శ్వేత సర్పము కదులుతున్న దృశ్యం

By Nellutla Kavitha  Published on  6 Dec 2022 3:26 PM IST
FactCheck : శేష్ నాగ్ సరస్సు మధ్యలో మహాసర్పం కదులుతూ కనిపించిందా?

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే దారిలో శేష్ నాగ్ అనే సరస్సులో మహా శ్వేత సర్పము కదులుతున్న దృశ్యం అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శేష నాగు నివసించే సరస్సు ఉంటూ, మహా సర్పం దర్శనం అయిందని ఫేస్బుక్లో ఒక యూజర్ షేర్ చేశారు.

https://www.facebook.com/reel/659988739123031


నిజ నిర్ధారణ

అమరనాథ్ యాత్రకు వెళ్ళే దారిలో ఉన్న శేషనాగ్ సరస్సులో నిజంగానే మహా శ్వేత సర్ప కదులుతోందా? ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. అమర్నాథ్ గుహకి వెళ్లే దారిలో, పహల్ గావ్ కి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శేషనాగ్ సరస్సు. భూమికి 3590 మీటర్ల ఎత్తున ఉందీ శేషనాగ్ సరస్సు.

https://en.wikipedia.org/wiki/Sheshnag_Lake

గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు యూట్యూబులో గతంలోనూ ఇలాంటి వీడియోనే పోస్ట్ చేసినట్టుగా కనిపించింది. 2017లో పోస్ట్ అయిన ఈ వీడియోలో కూడా శేష్ నాగ్ కనిపించినట్లుగా వీడియో లో ఉంది.

https://youtu.be/OqjlUq72KiQ


ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన అదే వీడియోను గతంలోనూ యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. 3 నెలల క్రితం అమర్నాథ్ యాత్ర 2022 పేరుతో ఇదే వైరల్ వీడియో కనిపిస్తుంది.

https://www.youtube.com/results?search_query=sesh+nag+lake

శేష్ నాగ్ సరస్సులో నీరు చలికాలంలో గడ్డకడుతుంది. చల్లటి వాతావరణం ఉండడం వల్ల సరస్సులో ఉన్న నీరు పై నుంచి కిందకి గడ్డకట్టడం ప్రారంభిస్తుంది. ఈ సరస్సు పాక్షికంగా గడ్డకట్టినప్పుడు వివిధ ఆకారాల్లో, మంచు గడ్డ కట్టిన ప్రాంతాల్లో చీలికలు కాగా, ఇతర ఆకారాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకేసారి ఏర్పడిన వివిధ ఆకారాలను ఈ వీడియోలో చూడొచ్చు.

https://www.youtube.com/shorts/np8ZA9h5JW0

0° C [32° F] కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పుడు సరస్సులు గడ్డ కడతాయి. ఈ సరస్సులోని నీరు పైనుంచి కిందికి గడ్డకట్టడం వల్ల సాధారణంగా మంచు నీటి పైన తేలుతుంది. సరస్సులో కింద ఉండే నీరు గడ్డ కట్టక పోవడం వల్ల మంచు మధ్యలో ఇలాంటి నీటి ఆకారాలు ఏర్పడతాయి.

https://www.britannica.com/science/lake-ice/Ice-growth

ఇక ఈ సరస్సులో మంచు పూర్తిగా కరిగిపోయిన సమయంలో ఎలాంటి ఆకారాలు కనిపించలేదు.

https://youtu.be/fG5go3ExVOs


దీనితో పాటుగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయినప్పుడు గడ్డకట్టే ఇతర సరస్సులు, నదులలో కూడా ఇలాంటి ఆకారాలు ఏర్పడడం గమనించవచ్చు.

https://www.shutterstock.com/image-photo/winter-landscape-frozen-pond-cottage-water-69993736

https://www.canstockphoto.com/winter-night-scene-on-frozen-lake-93929201.html

సో, పాక్షికంగా గడ్డకట్టిన శేష నాగ్ సరస్సు, మహా శ్వేత సర్పము నీడ, అందులోని నీటి దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మిస్ లీడింగ్.


Claim Review:శేష్ నాగ్ సరస్సు మధ్యలో మహాసర్పం కదులుతూ కనిపించిందా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:Misleading
Next Story