Fact Check: ప్రపంచంలోనే అత్యంత నలుపున్న చిన్నారి అంటూ ప్రచారం..?
Viral photo of 'world's darkest child' debunked. దక్షిణాఫ్రికాకు చెందిన "ప్రపంచంలోనే నలుపున్న శిశువు" చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sep 2022 5:43 AM GMTదక్షిణాఫ్రికాకు చెందిన "ప్రపంచంలోనే నలుపున్న శిశువు" చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం జూన్ 2015 నుండి వైరల్ గానే ఉంది. ఒక వైపు ప్రజలు శిశువు ఎంతో క్యూట్ గా ఉందని కామెంట్లు చేస్తూ ఉండగా.. మరోవైపు అది నిజమైన శిశువునా అని అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఫోటో మరోసారి వైరల్‌గా మారింది.
"World's darkest child in South Africa."అనే క్యాప్షన్‌తో ఫేస్‌బుక్ వినియోగదారు ఫోటోను పంచుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి వాదనలతో ఫోటో షేర్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ బృందం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటో Etsy లో కనిపించింది. ఆ ఫోటో కింద "Baby Sculpted Polymer Clay Monkey Gorilla Doll Poseable Miniature." అని ఉంది. కాబట్టి ఇది ఒక బొమ్మ అని మనకు తెలిసింది. అంతేకాకుండా ఈ ఫోటో చిన్నారిది కాదు. ఒక చిన్న గొరిల్లా. గొరిల్లా పిల్లకు సంబంధించిన బొమ్మ ఇది.
డిస్క్రిప్షన్ లో "Cute little gorilla girl hand sculpted from polymer clay. She has lots of detail which is hard to capture in pictures. This little cutie measures approximately 5.5 inches. She has a soft body made from a white cotton fabric that is filled with tiny pellets. Her head and arms and legs are all moveable which allows for many cute poses." అని ఉంది. అందమైన చిన్న గొరిల్లా బొమ్మను పాలీమర్ క్లేతో తయారు చేసిందని వివరించారు. ఈ బొమ్మ 5.5 అంగుళాలు ఉంటుంది. తెల్లటి కాటన్ ఫాబ్రిక్‌తో తయారు చేసిన మృదువైన శరీరాన్ని కలిగి ఉంది. బొమ్మ తల, చేతులు, కాళ్ళు అన్నీ కదిలించవచ్చని తెలిపారు.
బొమ్మ సృష్టికర్తను కనుగొనడానికి ప్రయత్నించాం. కనుగొనడానికి కీవర్డ్ శోధనను నిర్వహించగా.. 'లిలా పియర్సన్' తన సేకరణ 'బ్రీత్ ఆఫ్ హెవెన్'లో ఈ బొమ్మను తయారు చేసింది. మేము ఆమె Pinterest ఖాతాలో ఇటువంటి ఎన్నో క్రియేషన్‌లను కనుగొన్నాము.
అదే కలెక్షన్ ను eBayలో కూడా చూడవచ్చు.
ఈ పాప గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిందని పోస్ట్ వైరల్ చేసింది. మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాం. అయితే దానికి సంబంధించి ఏమీ కనుగొనబడలేదు.
"World's darkest child in South Africa." అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులు నిజం కాదు.