విదేశాల నుంచి అరుదైన చిరుత పులులను మన దేశానికి తీసుకొచ్చి పునరుత్పత్తి ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుత పులులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పాల్పూర్ జాతీయ పార్కుకు తీసుకు వచ్చారు. నమీబియా రాజధాని విండ్‌హోక్ నుండి ఎనిమిది చిరుతలు ఇండియాకు తెచ్చారు. చార్టర్డ్ బోయింగ్ 747 కార్గో విమానంలో వీటిని తీసుకువచ్చారు. ప్రధాని మోదీ వాటిని విడుదల చేసి.. ఫోటోలను తీశారు.
ఆ సందర్భానికి చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, అందులో ఆయన లెన్స్ కవర్‌తో DSLR కెమెరాతో చిత్రాలను క్లిక్ చేయడం చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్, కొందరు నాయకులు వైరల్ ఫోటోను పంచుకున్నారు. ఇటీవల తీసుకొచ్చిన చిరుతలను ఫోటో తీస్తున్నప్పుడు కెమెరా లెన్స్ కవర్‌ను అతను తీసివేయలేదని వారు పేర్కొన్నారు.
పోస్ట్‌ను వీక్షించడానికి ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి
సెప్టెంబర్ 17న, ఎనిమిది ఆఫ్రికన్ చిరుతలు ఐదు ఆడ, రెండు మగ చీతాలను తీసుకుని వచ్చారు. ఏడు దశాబ్దాల క్రితం అంతరించిపోయిన చీతాలు తాజాగా నమీబియా నుండి భారతదేశానికి బదిలీ చేయబడ్డాయి. ప్రధానిని ఎగతాళి చేస్తూ, మహారాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధికారిక హ్యాండిల్ ఫోటోను షేర్ చేస్తూ "The digital cameras of the 1980s had no lens cover." ఇలా రాసింది.
ఫేస్‌బుక్‌లో కూడా ఈ ఫోటో విపరీతంగా షేర్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 చిరుతలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో దాదాపు 4,500 నివసిస్తున్నాయి. భారతదేశం ఈ సంవత్సరం 20 ఆఫ్రికన్ చిరుతలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నమీబియా నుండి ఎనిమిది, దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలు తీసుకురానున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు గతంలో తెలిపారు.
నిజ నిర్ధారణ:
NewsMeter ఫోటోలో క్రింది వ్యత్యాసాలను గమనించింది.
1. DSLR కెమెరా బ్రాండ్ Nikon, కానీ అక్షరాలు రివర్స్ ఆర్డర్‌లో ఉన్నాయి, ఫోటో అడ్డంగా రివర్స్ చేయబడిందని మాకు క్యూని ఇచ్చింది.
2. కవర్‌పై ఉన్న బ్రాండ్ కానన్ అని చదువుతుంది, ఇది కవర్ డిజిటల్ ఎడిట్ ద్వారా జోడించబడిందని నిర్ధారించాం.
3. కవర్‌పై బ్రాండ్ పేరు Canon స్పష్టంగా చదవబడుతుంది. కెమెరాలో బ్రాండ్ పేరు Nikon అని పిక్సలేట్ చేయబడింది.
ఈ సూచనలను తీసుకొని, మేము ఫోటో ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. కునో నేషనల్ పార్క్‌లో మోదీ చిరుతలను విడుదల చేయడంపై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికను కనుగొన్నాము. ఆ నివేదికలో DSLR కెమెరాతో మోదీకి సంబంధించిన మూడు ఫోటోలు ఉన్నాయి. వాటిలో దేనిపైనా లెన్స్‌పై కవర్ లేదు.
నివేదికలో మార్ఫింగ్ చేయబడిన అసలు ఫోటో కూడా ఉంది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా అదే ఫోటోను విడుదల చేసింది.
సర్క్యులేట్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ అని తేలింది. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.