నిజమెంత: బంగ్లాదేశ్‌లో హిందూ బాలికపై జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో ఇది కాదు

బంగ్లాదేశ్‌లో మైనారిటీ కమ్యూనిటీ హిందువులపై హింస పెరిగిందనే వాదనలతో సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2024 12:15 PM IST
student, protest falsely,   hindu girl,  bangladesh

నిజమెంత: బంగ్లాదేశ్‌లో హిందూ బాలికపై జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో ఇది కాదు

షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, బంగ్లాదేశ్ విడిచి వెళ్ళిపోయిన తర్వాత.. దేశంలోని మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందువులపై హింస పెరిగిందనే వాదనలతో సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసకు నిదర్శనంగా ఓ బాలిక చేతులు, కాళ్లు కట్టేసి, నోరు మూసేసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

X ఖాతా, ది జైపూర్ డైలాగ్స్ ఈ వీడియోను భాగస్వామ్యం చేసింది. “బంగ్లాదేశ్‌లోని హిందూ మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా చంపేశారు! బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మారణహోమాన్ని హిందువులు కళ్లారా చూస్తున్నాం. ఈ చిత్రాలు, వీడియోలు మిమ్మల్ని చాలా బాధిస్తాయి! (ఆర్కైవ్)" అని తెలిపారు.

మరో X ఖాతా, ‘#HindusAreNotSafeInBangladesh’, ‘#HindusUnderAttack’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి వీడియోను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.

బంగ్లాదేశ్‌లోని జగన్నాథ్ యూనివర్శిటీకి చెందిన ఒక విద్యార్థి చేసిన నిరసన వీడియో ఇది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు న్యూస్‌మీటర్‌కు ధృవీకరించారు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. జూలై 26న Facebook ఖాతా JnU షార్ట్ స్టోరీస్ పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము.

ఆ వీడియో వీధి నాటకంలో భాగం. జగన్నాథ్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా ఈ నాటకం వేశారు. అయితే, బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత విద్యార్థి ఉద్యమానికి లింక్ చేస్తూ, ఆ అమ్మాయిని ఛత్ర లీగ్‌కు నాయకురాలిగా వీడియో వైరల్‌ చేస్తున్నారు.

ఈ తప్పుడు సమాచారం వ్యాప్తి సదరు అమ్మాయికి మానసిక క్షోభను కలిగించిందని తెలిపింది. పుకార్లు వ్యాప్తి చేయడం మానేయమని ప్రజలను కోరింది. దీని నుండి ఒక సూచన తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. మార్చి 17న బెంగాలీ వార్తాపత్రిక ది డైలీ ఇత్తెఫాక్ ప్రచురించిన నివేదికను కూడా మేము కనుగొన్నాము.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఫైరుజ్ సదాఫ్ అబంతికకు న్యాయం చేయాలంటూ జగన్నాథ్ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తులు వెలిగించడం, వీధి నాటకాలు ప్రదర్శించారని నివేదిక పేర్కొంది.

బంగ్లాదేశ్‌లోని వార్తా ఆధారిత శాటిలైట్ టెలివిజన్ ఛానెల్ అయిన 'ఛానల్ 24 న్యూస్' మార్చి 18న అబంతికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల ఊరేగింపు వీడియోను మేము కనుగొన్నాము.

మరింత ధృవీకరణ కోసం, NewsMeter జగన్నాథ్ విశ్వవిద్యాలయం కరస్పాండెంట్ అబూ హనీఫ్‌ను సంప్రదించింది. వైరల్ వీడియో మార్చి 17న చిత్రీకరించబడిందని, అబంతికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాటకాన్ని ప్రదర్శించినట్లు ఆయన ధృవీకరించారు. “ఈ వీడియో బంగ్లాదేశ్‌లో ప్రస్తుత సంక్షోభానికి సంబంధించినది కాదు. హిందూ బాలికపై జరిగిన దాడులను చూపడం లేదు” అని హనీఫ్ స్పష్టం చేశారు.

Bdnews24 కోసం జగన్నాథ్ యూనివర్శిటీ రిపోర్టర్ అనుపమ్ మల్లిక్ ఆదిత్య వైరల్ అవుతున్న పోస్టులు పుకార్లు అని కొట్టిపారేశారు. వీడియోలో ఉన్న అమ్మాయి యూనివర్సిటీలోని సంగీత విభాగానికి చెందిన విద్యార్థిని అని ధృవీకరించారు. యూనివర్సిటీలో ఎదుర్కొన్న వేధింపుల కారణంగా మార్చి 15న ఆత్మహత్య చేసుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ లా విద్యార్థి అబంతికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన నిరసనకు సంబంధించిన వీడియో ఇది.

కాబట్టి, బంగ్లాదేశ్‌లో హిందూ బాలికపై జరిగిన అకృత్యాలను వీడియో చూపించలేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim Review:నిజమెంత: బంగ్లాదేశ్‌లో హిందూ బాలికపై జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో ఇది కాదు
Claimed By:X users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story