నిజమెంత: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డయాబెటిస్ మందులను ప్రమోట్ చేశారా?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డయాబెటిస్ మందులను ప్రమోట్ చేశారా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 May 2024 3:30 PM GMTరాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డయాబెటిస్ మందులను ప్రమోట్ చేశారా?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, న్యూస్ యాంకర్ అంజనా కశ్యప్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధుమేహాన్ని నయం చేసే మందుని ప్రమోట్ చేస్తున్నట్లు అనిపించే వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉన్నాయి.
“ఒక గొప్ప శాస్త్రవేత్త సెల్యులార్ స్థాయిలో మధుమేహాన్ని నయం చేసే వినూత్న మందును రూపొందించారు. త్వరగా సైట్‌ని సందర్శించండి!" అనే అర్థం వచ్చేలా పలువురు పోస్టులను పెడుతున్నారు.
నిజ నిర్ధారణ:
డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేసే మందు ఇంకా రాలేదు. కాబట్టి, వైరల్ అవుతున్న ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది. వైరల్ వీడియోను రూపొందించడానికి ఉపయోగించిన క్లిప్‌లు వాయిస్ క్లోనింగ్‌ని ఉపయోగించి డిజిటల్‌గా తీర్చిదిద్దారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్న వీడియోకు.. డిజిటల్ గా ఆడియోను మార్చి మధుమేహాన్ని కొన్ని మందులు నయం చేశాయని ఆమె చెప్పడం వైరల్ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను ఉపయోగించి Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము జూలై 27, 2022న పోస్ట్ చేసిన Sansad TV కి చెందిన YouTube ఛానెల్‌లో అసలైన వీడియోను కనుగొన్నాము. ఫుటేజ్‌లో మధుమేహం గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడొచ్చు.
YouTube వీడియోలో 0.42 సెకన్ల టైమ్‌స్టాంప్‌లో వైరల్ క్లిప్‌ను మనం చూడొచ్చు.
రెండవ క్లిప్‌లో ఆజ్ తక్ యాంకర్ అంజనా ఓం కశ్యప్ డయాబెటిస్‌ను నయం చేసే మందులను అందించే వెబ్‌సైట్ గురించి చర్చిస్తున్నట్లు మనం గుర్తించవచ్చు. డాక్టర్ అభినాష్ మిశ్రాను ఔషధాన్ని కనుగొన్న వైద్య నిపుణుడిగా కూడా చెప్పుకొచ్చారు. మేము వీడియోను నిశితంగా విశ్లేషించాము. అందులో లిప్ సింక్ ఏ మాత్రం సరిపోలేదని.. చాలా వ్యత్యాసాలను కనుగొన్నాము.
తరువాతి రెండు క్లిప్‌లలో కనిపించిన వ్యక్తిని డాక్టర్ అభిలాష్ మిశ్రా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్, డాక్టర్ అతుల్ గవాండే అని తేలింది.
Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, అసలు వీడియోలను కనుగొన్నాము. మార్చి 2, 2021న షేర్ చేసిన CNBC ఇంటర్వ్యూలో డాక్టర్ గవాండే ఉన్న మొదటి క్లిప్‌ని కూడా మేము కనుగొన్నాము. డాక్టర్ గవాండే బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్స్ గురించి చర్చించారు.
ఆ తర్వాతి వీడియోను BBC రేడియో 4 డిసెంబర్ 1, 2014న షేర్ చేసింది. ఇందులో ఆయన వైద్యుల పాత్ర గురించి చర్చించారు.
ముఖ్యంగా.. ఈ వీడియోలలో దేనిలోనూ డాక్టర్ గవాండే మధుమేహం లేదా వాటి నివారణకు సంబంధించిన మందుల గురించి ప్రస్తావించలేదు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించిన వీడియోను కూడా ఎడిట్ చేశారు. ఇద్దరు ఆజ్ తక్ యాంకర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మధుమేహానికి సంబంధించిన మందులను ఆయన ప్రమోట్ చేయలేదు. చివరి క్లిప్ ను డిజిటల్‌గా ఎడిట్ చేశారని గుర్తించాము.
సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి Googleలో సెర్చ్ చేయడం ద్వారా.. జనవరి 16, 2024న ఆజ్ తక్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన YouTube వీడియోను మేము కనుగొన్నాము. శ్వేతా సింగ్, అంజనా కశ్యప్ యాంకరింగ్ చేసిన ఈ ఇంటర్వ్యూ అయోధ్యలోని రామాలయం గురించి, ఇతర రాజకీయ పరమైన అంశాల గురించి చర్చించారు. మొత్తంలో మధుమేహానికి సంబంధించిన మందుల గురించి ఎటువంటి ప్రస్తావన జరగలేదు.
వైరల్ అవుతున్న వీడియోలను డిజిటల్‌గా ఎడిట్ చేశారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డయాబెటిస్ డ్రగ్ ను ప్రమోట్ చేయలేదు.