నిజమెంత: విరాట్ కోహ్లీ ఆన్ లైన్ క్యాసినోను ప్రమోట్ చేయలేదు

విరాట్ కోహ్లీ ఆన్‌లైన్ క్యాసినో యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 March 2024 11:25 AM GMT
kohli, promoting,   casino app, deepfake,

నిజమెంత: విరాట్ కోహ్లీ ఆన్ లైన్ క్యాసినోను ప్రమోట్ చేయలేదు

సచిన్ టెండూల్కర్, నిర్మలా సీతారామన్ తర్వాత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆన్‌లైన్ క్యాసినో యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది.

వైరల్ వీడియోలో కోహ్లీ కొత్తగా ప్రారంభించిన క్యాసినో యాప్‌ను ప్రమోట్ చేశారు. భారత్ 24 అనే మీడియా ఛానెల్‌లో ప్రచారం చేస్తున్నట్లు చూపిస్తుంది. వీడియోలో.. కోహ్లీ ఈ యాప్‌ ద్వారా భారీగా నగదు సంపాదించవచ్చని హామీ ఇచ్చారు. 101F అనే క్యాసినో గేమింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని.. Google Play Storeకి దారి మళ్లించిన Facebook పోస్ట్‌లోని లింక్‌ను కూడా వీడియో ప్రచారం చేసింది.

నిజ నిర్ధారణ:

వీడియోలో ఉన్నది విరాట్ కోహ్లీ కాదు. డీప్‌ఫేక్‌ని ఉపయోగించడం వల్ల ఆ వాదన తప్పని న్యూస్‌మీటర్ కనుగొంది.

వైరల్ వీడియోను నిశితంగా విశ్లేషించగా.. మేము వీడియోలో అసలైన క్లారిటీ లేదని గుర్తించాం. వీడియో-ఆడియోకు మధ్య తేడాలు కూడా గమనించాం.

వాయిస్ కు లిప్ సింక్ కు మధ్య చాలా వ్యత్యాసాలను కనుగొన్నాము. విరాట్ కోహ్లి ఏదైనా అటువంటి యాప్‌ను ప్రచారం చేసి ఉంటే లేదా ఓనర్ గా మారి ఉండి ఉంటే.. అది ఖచ్చితంగా ప్రధాన స్రవంతి మీడియా ద్వారా తప్పనిసరిగా కవర్ చేశారు.

విరాట్ కోహ్లీ ఆన్‌లైన్ క్యాసినో యాప్‌ను లాంచ్ చేయడం గురించి మీడియా రిపోర్టులను తనిఖీ చేయడానికి కీవర్డ్ సెర్చ్ చేయడం ద్వారా మేము మా పరిశోధనను ప్రారంభించాము. కానీ ఎలాంటి వార్త కూడా కనుగొనలేకపోయాము.

మేము డిసెంబర్ 22, 2023 నాటి గ్రాహం బెన్సింగర్ YouTube ఛానెల్‌లో వైరల్ వీడియోకు సంబంధించిన అసలైన, పొడిగించిన సంస్కరణను మేము కనుగొన్నాము.

ఒరిజినల్ వీడియో, అమెరికన్ జర్నలిస్ట్, వ్యాపారవేత్త అయిన గ్రాహం బెన్‌సింగర్ విరాట్ కోహ్లీ జీవితం, క్రికెట్ గురించి ఇంటర్వ్యూ చేశారు. కోహ్లీ తన తండ్రి మరణం, అతని మానసిక ఆరోగ్యం.. ఆ ప్రభావం, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మతో తన సంబంధంతో సహా తన గతం గురించి చాలా విషయాలను మాట్లాడారు. అనుష్క శర్మతో మొదటిసారి మీట్ అయినప్పటి నుండి వారి వివాహ వేడుక వరకు మొత్తం వివరాలు తెలిపారు.

ఎడిట్ చేసిన వెర్షన్.. వీడియో 40 సెకన్ల తర్వాత వస్తుంది. రెండు వీడియోలలో వైరల్ కోహ్లీ చేసిన అదే చేతి సంజ్ఞల దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది. అతను క్రికెట్ చూసిన తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాత్రమే మాట్లాడాడు. వీడియోలో మరెక్కడైనా క్యాసినో గేమింగ్ యాప్ గురించి ప్రస్తావించలేదు.

అందుకే, విరాట్ కోహ్లీ బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్న వీడియో డీప్‌ఫేక్ అని మేము నిర్ధారించాము.

డీప్‌ఫేక్‌లతో సమస్య:

డీప్‌ఫేక్‌లను రూపొందించి.. ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు క్యాసినో యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గమనించవచ్చు. ఆయా ప్రముఖుల వాయిస్ ను డిజిటల్ వెర్షన్‌లను రూపొందించారు. డీప్‌ఫేక్‌ల గురించి మరిన్ని వివరాలను ఇప్పటికే న్యూస్ మీటర్ ద్వారా తెలియజేశాం. ఇక్కడ మరియు ఇక్కడ ఇప్పటి వరకూ డీప్‌ఫేక్‌లను, ముఖ్యంగా భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన కవరేజీని మేము సవివరంగా వివరించాం.

Meta కొత్త హెల్ప్‌లైన్, ఫ్యాక్ట్ చెక్ విభాగం:

ఇటీవల, Meta భారతదేశంలో AI రూపొందించిన డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో కొత్త హెల్ప్‌లైన్, ఫ్యాక్ట్ చెక్ ను ప్రారంభించారు. భారతదేశంలో మెటా హెల్ప్‌లైన్‌ను చేపట్టడానికి Misinformation Combat Alliance (MCA)తో భాగస్వామ్యం కలిగి ఉంది. హెల్ప్‌లైన్ భారతదేశంలోని పలు భాషల్లో సహాయాన్ని అందిస్తోంది.

Claim Review: విరాట్ కోహ్లీ ఆన్ లైన్ క్యాసినోను ప్రమోట్ చేయలేదు

Claimed By:News 24

Claim Reviewed By:NewsMeter

Claim Source:Facebook

Claim Fact Check:False

Next Story