Fact Check: నెయ్యిలో పాలు కలవడం వల్ల ఏర్పడిన అగ్నిగోళమిది
This Is What Happens When Milk Hits Hot Ghee. “ఈ హోమాన్ని ప్రవర్గ్య హోమం అంటారు. ఈ హోమం సాధారణంగా అర్ధరాత్రి
By Nellutla Kavitha Published on 9 Feb 2023 10:51 AM GMT“ఈ హోమాన్ని ప్రవర్గ్య హోమం అంటారు. ఈ హోమం సాధారణంగా అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది. వేదాలను పఠించడం ద్వారా వేద గ్రంథాల ప్రకారం పూర్తిగా నిర్వహించబడే అత్యంత ముఖ్యమైన యాగాలలో ఇది ఒకటి. ఈ యాగం ఆంధ్రప్రదేశ్ లోని పెద్దాపురం అనే ప్రాంతంలో ఈ నెల అర్ధరాత్రి సమయంలో జరిగింది. మీరు చూస్తున్న దృశ్యం యాగం లోని ఒక అంశం మాత్రమే. ఈ యాగాన్ని అనుభవజ్ఞులైన వేద పండితులు మాత్రమే నిర్వహించగలరు. పేలుడు మరియు అణుబాంబ్ ఆకారం కేవలం 50 ML స్వచ్ఛమైన నెయ్యి ఫలితంగా వచ్చిందని మీరు నమ్మగలరా?" అంటూ ఒక వీడియో వైరల్ గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో పై ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ లోని పెద్దాపురంలో ప్రవర్గ్య హోమం నిర్వహించారని ఇప్పుడు వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న వీడియో గతంలోనే సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ పోస్ట్ చేసినట్టుగా గమనించింది న్యూస్ మేటర్ టీం. ఈ వీడియోను May 27, 2021 ఒక నైటిజన్ యూట్యూబ్ లో, ఆంధ్రప్రదేశ్ లోని పెద్దాపురంలో ఈ హోమం నిర్వహించినట్టుగా పోస్ట్ చేశారు.
ఇక గతంలోనూ ఇదే వీడియోను ట్విట్టర్ లో కూడా మరొక నెటిజన్ షేర్ చేశారు. April 20 రోజున ఈ హోమం జరిగినట్టుగా, May 1, 2018 రోజు ట్వీట్ చేశారు. ట్వీట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రవర్గ్య హోమం మిగతా హోమాలకు, యాగాలకు విభిన్నంగా ఉంటుంది. సోమయాగంలో భాగంగా ప్రవర్గ్య చేస్తారు. ఇతర యాగాలు, హోమాలలో నెయ్యి, యాగద్రవ్యాలను ఉపయోగిస్తారు. అయితే ప్రవర్గ్యలో మాత్రం మహావీరం అనే పాత్రలో ఆవు నెయ్యితో పాటుగా ఆవు పాలు, మేకపాలను కలిపి హోమగుండంలో పోస్తారు. దీంతో మండుతున్న అతిపెద్ద అగ్నిగోళం ఎత్తుగా పైకి లేస్తుంది. సోమయాగం, ప్రవర్గ్య కు సంబంధించి సమాచారాన్ని వీడియోను ఇక్కడ చూడవచ్చు. http://somayag.org/category/uncategorized/
మహావీరమనే పాత్రలో ఆవు నెయ్యిని బాగా మరిగించి, అందులో అప్పుడే తీసిన ఆవుపాలను, మేకపాలను కలిపి హోమగుండంలో వేస్తారు. అప్పుడది పెద్ద విస్ఫుటనంలా, అగ్నిగోళం ఎత్తుగా, పైకి లేస్తుంది.
నూనె, నెయ్యి వంటి ద్రవాల అణువుల పరిమాణం, నీళ్లతో పోలిస్తే పెద్దగా ఉంటుంది. వాటిలో హైడ్రోజన్, కార్బన్ ఎక్కువగా ఉంటాయి. అయితే నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల నూనె, నెయ్యితో కలిసినప్పుడు, నీరు కిందికి చేరుతుంది. అయితే పాత్రను విపరీతంగా వేడి చేయడం వల్ల, అందులో ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారుతుంది. దీంతో భారీ పేలుడు లేదా అగ్నిగోళం ఏర్పడుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రవర్గ్య వీడియో 2018 ఏప్రిల్ లో జరిగినట్టుగా యూట్యూబ్ లో పబ్లిష్ చేసిన ఒక పోస్ట్ ని చూసి అర్థమవుతుంది. సెప్టెంబర్ 26, 2021 రోజున ప్రవర్గ్య గురించి చెప్తున్న ఒక వీడియోను యూట్యూబ్ లో పబ్లిష్ చేశారు. పెద్దాపురంలో జరిగిన మహా సోమయాగం అంటూ ఇందులో వివరించారు.
సో ప్రవర్గ్య యాగంలో ఉపయోగించింది కేవలం నెయ్యి మాత్రమే కాదు. మరుగుతున్న నూనె, నెయ్యి లాంటి పదార్థాలలో పాలు, నీళ్లు కలిసినప్పుడు విస్పోటనంలా అగ్నిగోళం ఏర్పడుతుంది. మరోవైపు పాత వీడియోను ఈ నెలలో జరిగింది అంటూ ఇప్పుడు షేర్ చేస్తున్నారు.