Fact Check: అంతరించడానికి సిద్ధంగా ఉన్న ఈ రాబందు గతంలోనూ మనదగ్గర కనిపించింది

This Is Not The First Time A Himalayan Griffom Vulture Was Seen In India. “జటాయు పక్షి నిజమైనదని రుజువు చేస్తూ నేషనల్ మీడియాలో వార్త, ఈ పక్షి ప్రస్తుతం అయోధ్యలో

By Nellutla Kavitha  Published on  13 Feb 2023 8:55 AM GMT
Fact Check: అంతరించడానికి సిద్ధంగా ఉన్న ఈ రాబందు గతంలోనూ మనదగ్గర కనిపించింది

“జటాయు పక్షి నిజమైనదని రుజువు చేస్తూ నేషనల్ మీడియాలో వార్త, ఈ పక్షి ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న తరుణంలో హిమాలయాలలో ఉన్న కాన్పూర్‌లో సమీపంలో ఉంది. మనం సినిమాల్లో, రామాయణం సీరియల్స్‌లో చూసిన పక్షి లాంటిదే జటాయువు. 15 రోజులుగా వెట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంది." అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది

ఇక ఇదే వీడియోను మరి కొంతమంది ఫేస్బుక్ లోనూ, ట్విట్టర్ లోను షేర్ చేశారు. ఆ పోస్టులను ఇక్కడ చూడవచ్చు.

అంతరించడానికి సిద్ధంగా ఉన్న ఈ రాబందు గతంలోనూ మనదగ్గర కనిపించింది. వైరల్ అవుతున్న వీడియోల కోసం ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్‌ చేయండి.

నిజ నిర్ధారణ

సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలో నిజమెంత?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసి చూసింది న్యూస్ మీటర్ టీం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ న్యూస్ క్లిప్ జనవరి 9, 2023 రోజున TIMES NOW Navbharat అనే న్యూస్ ఛానల్, యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది.


ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దొరికింది అతి అరుదైన రాబందుల జాతికి చెందిన Himalayan griffon vulture అని, అది ఈద్గా సమీపంలోని స్మశానంలో దొరికిందని, గాయాలతో ఉండడం వల్ల దానిని పట్టుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు అప్పగించారని ANI, Jan 9, 2023 రోజున ట్విట్టర్ లో తెలిపింది. స్థానికులు రాబందు కాళ్ళను తాళ్లతో బంధించడం వల్ల అది గాయపడిందని, దానికి మెరుగైన చికిత్స అందించడానికి కొద్దికాలం క్వారెంటైన్ లో ఉంచాల్సిన అవసరం ఉందని కాన్పూర్ జూ డిప్యూటీ డైరెక్టర్ అందించిన వివరాలను ANI ట్వీట్లో వివరించింది.

అంతరించడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో ఈ రాబందుల్ని చేర్చారు. ఇవి ఎక్కువగా హిమాలయాలతో పాటుగా దానికి ఆనుకొని ఉన్న టిబెట్ పీఠభూమిలో కూడా కనిపిస్తుంటాయి.

https://en.wikipedia.org/wiki/Himalayan_vulture

ఇలాంటి Himalayan griffon వల్టర్ రాబందులు గతంలోనూ కనిపించాయి, ఇదే మొదటిసారి కాదు. జమ్మూ కాశ్మీర్ లోని దాల్ లేక్ దగ్గర ఒకసారి కనిపిస్తే మరొకసారి దక్షిణాదిలోని తమిళనాడులో కూడా కనిపించింది. వాటికి సంబంధించిన కథనాలు ఇక్కడ అండ్ ఇక్కడ ఉన్నాయి.

ఇక 2016 లో హర్యానా రాష్ట్రంలోని పింజోర్ లో ఉన్న వల్చర్ బ్రీడింగ్ సెంటర్ నుంచి రెండు హిమాలయన్ గ్రిఫన్ వాల్చర్లను మొట్టమొదటిసారిగా అడవుల్లో, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి వదిలేశారన్న వార్తను ఇక్కడ చూడవచ్చు.

రెండేళ్ల క్రితం, విషాహారానికి గురైన 25 హిమాలయన్ గ్రిఫన్ వల్చర్లను గుర్తించి, మెరుగైన వైద్యం అందించి, వాటిని తిరిగి వదిలేసామని, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులకు చెందిన ఈ అధికారి ఇటీవల చేసిన ట్వీట్ ను ఇక్కడ చూడవచ్చు.

సో, రామ మందిరం నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలోనే కాదు, గతంలో కూడా Himalayan Griffon Vultures మన దగ్గర కనిపించాయి.

Claim Review:అంతరించడానికి సిద్ధంగా ఉన్న ఈ రాబందు గతంలోనూ మనదగ్గర కనిపించింది
Claimed By:social media users
Claim Reviewed By:Newsmeter
Claim Source:social media
Claim Fact Check:Misleading
Next Story