అది కుప్పంలో జరిగిన ర్యాలీ కాదు కర్నాటకలో సిద్ధేశ్వర స్వామి అంతిమయాత్ర వీడియో

తెలుగుదేశం కార్యకర్తలకు తిక్క రేపితే ఇలాంటివి చూడల్సివస్తది.... కుప్పం ప్రజలకి.... ధన్యవాదాలు

By Nellutla Kavitha  Published on  6 Jan 2023 5:35 PM IST
అది కుప్పంలో జరిగిన ర్యాలీ కాదు కర్నాటకలో సిద్ధేశ్వర స్వామి అంతిమయాత్ర వీడియో

"తెలుగుదేశం కార్యకర్తలకు తిక్క రేపితే ఇలాంటివి చూడల్సివస్తది.... కుప్పం ప్రజలకి.... ధన్యవాదాలు" అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

ఇక ఇదే వీడియోని మరో నెటిజన్ "కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా , సొంత కులపు ఓట్లు కనీసం ఒక్క శాతం కూడా సరిగ్గా లేవు..ఆయనంటే అంత ఇష్టం ఆ నియోజకవర్గానికి" అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

మరోవైపు ఇదే వీడియోని మరికొంతమంది ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేశారు.

నిజనిర్ధారణ

వైరల్ గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలో నిజం ఎంత ?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న వీడియోకి సంబంధించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ తో పాటుగా కీ ఫ్రేమ్ అనాలసిస్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో ఈ వీడియో కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయపుర జిల్లా కేంద్రంలోని విజయపుర జ్ఞానయోగాశ్రమ పిఠాధిపతి సిద్ధేశ్వర స్వామి అంతిమయాత్ర సందర్భంగా తీసినది గా తెలిసింది. Jan 4, 2023 రోజున ఒక నెటిజన్, సిద్ధేశ్వర స్వామి అంతిమయాత్ర సందర్భంగా రెండు లక్షల మంది భక్తులు పాల్గొన్నారని ట్విట్టర్ లో ఇదే వీడియోని పోస్ట్ చేశారు.

వాకింగ్ గాడ్ గా పిలిచే సిద్ధేశ్వర స్వామి మరణంపై ప్రధాని మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
https://zeenews.india.com/telugu/india/karnataka-seer-siddheshwara-swamiji-dies-at-81-siddeshwara-swamiji-last-rites-cremation-news-88432
ఈ నేపథ్యంలోనే మరో సారి కీవర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో సిద్ధేశ్వర స్వామి అంతిమ యాత్రకు సంబంధించి NewsFirst Kannada అని కర్ణాటకకు సంబంధించిన న్యూస్ ఛానల్ వీడియో ఒకటి కనిపించింది. 20:47 నిమిషాల నిడివి ఉన్న అంతిమయాత్ర వీడియోలు 16:59 నిమిషాల దగ్గర వైరల్ వీడియోలో కనిపించిన ఒక భవనంతో పాటుగా అతి పెద్ద బోర్డు కూడా కనిపించింది.


ఆ బోర్డ్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విజయపుర జిల్లాలోని రూపా దేవి స్కూల్స్ కి సంబంధించినది.
https://preprimaryschools.com/school/roopadevi-international-school-6631
ఇక అంతిమ యాత్రకు సంబంధించి మరొక యాంగిల్లో ఇతర దృశ్యాలన్నీ ఇక్కడ చూడవచ్చు.



సో, సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన వీడియో కుప్పంలో టిడిపి ర్యాలీకి సంబంధించింది కాదు. అది కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిద్దేశ్వర స్వామి అంతిమయాత్ర కి సంబంధించిన వీడియో.

Claim Review:Video of chandrababu's Rally Held At Kuppam
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story