గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ, బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు, దేశాధినేతలు, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి బిలియనీర్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హై-ప్రొఫైల్ ప్రముఖులు హాజరయ్యారు.
ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ పెళ్లికి మూడు నెలల పాటు రీఛార్జ్ ఉచితంగా అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతూ ఉంది. మెసేజ్‌లో రీఛార్జ్ కి సంబంధించిన లింక్ కూడా పెట్టారు.
“జులై 12న అనంత్ అంబానీ వివాహం సందర్భంగా, ముఖేష్ అంబానీ భారతదేశంలో 3 నెలల ఉచిత రీఛార్జ్ రూ.749 ఇస్తున్నారు. కాబట్టి దిగువ ఉన్న లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోండి” అంటూ ఓ సందేశం వైరల్ అవుతూ ఉంది.
పలువురు Facebook వినియోగదారులు పోస్ట్ చేసిన సందేశాన్ని కూడా మేము కనుగొన్నాము. ఇది WhatsApp గ్రూప్ లలో కూడా వైరల్ అయింది.
నిజ నిర్ధారణ:
ఆ సందేశం నకిలీదని న్యూస్‌మీటర్ గుర్తించింది. అంబానీకి చెందిన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ జియో నుండి అలాంటి ఆఫర్ ఏదీ రాలేదు.
ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి ఉచిత ఫోన్ రీఛార్జ్ అందిస్తున్నట్లు కీవర్డ్ సెర్చ్ చేసాము. అయితే అటువంటి ప్రత్యేక ఆఫర్ గురించి విశ్వసనీయమైన వార్తా నివేదికలు ఏవీ కనుగొనలేకపోయాం. మేము Jio అధికారిక వెబ్‌సైట్‌ని తనిఖీ చేసాము.. కానీ అటువంటి ఆఫర్ ఏదీ కనిపించలేదు. మేము కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్‌లను (రిలయన్స్ జియో, జియోకేర్) కూడా తనిఖీ చేసాము, కానీ ఫ్రీ రీఛార్జ్ కు సంబంధించిన ప్రకటన ఏదీ కనుగొనలేకపోయాం.
వెబ్ సైట్ లింక్ ఫేక్ అని గుర్తించడం ఎలా?
మెసేజ్‌లోని URL మమ్మల్ని ‘అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఆఫర్ 2024’ పేరుతో ఉచిత రీఛార్జ్ ఆఫర్‌ను అందించడానికి క్లెయిమ్ చేసే వెబ్‌సైట్‌కి దారితీసింది. అయితే, ఇది జియో అధికారిక వెబ్‌సైట్ కాదు.
మేము రీఛార్జ్ పొందిన వ్యక్తుల పేర్లను కూడా కామెంట్లలో చూశాం. ఇది స్కామ్ సైట్‌లలో కనిపించే కంటెంట్‌ని పోలి ఉంది. వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేసిన వారికి సంబంధించిన మొబైల్ నంబర్‌ను కూడా కోరింది. ఆపై సందేశాన్ని ఐదు వాట్సాప్ గ్రూపులలో లేదా పది మంది స్నేహితులలో పంచుకోవాలని కోరింది.
చివరగా మోసాలను ధృవీకరించే వెబ్ సైట్ స్కామ్ డిటెక్టర్ లో వైరల్ లింక్ కు సంబంధించిన URLని సెర్చ్ చేశాం. అయితే చాలా తక్కువ రేటింగ్‌ను ఇచ్చింది. 'అత్యంత అనుమానాస్పదమైనది'గా గుర్తించింది.
“ఈ వెబ్‌సైట్ విశ్వసనీయతను కోల్పోయేలా ఉంది. వెబ్ సైట్ నాణ్యత సందేహాస్పదంగా ఉందని చూపిస్తుంది, ” అని Scam డిటెక్టర్ నివేదికను చదివాము. ‘యంగ్ అండ్ అన్‌సేఫ్’ డొమైన్ అని తెలిపింది. స్కామ్ డిటెక్టర్ అల్గారిథమ్ వెబ్‌సైట్ కు 3.6/100 రేటింగ్ ఇచ్చింది. కాబట్టి ఇది ఒక స్కామ్ వెబ్ సైట్ అనే అవగాహన మనకు వచ్చింది.
ముకేష్ అంబానీ మూడు నెలల పాటు ఉచిత రీఛార్జ్‌ను అందిస్తున్నట్లు వైరల్ మెసేజీ ఫేక్ అని మేము నిర్ధారించాము.
credits: Md Mahfooz Alam