నిజమెంత: ఆ వైరల్ ఫోటోలో ఉన్నది ఆలియా భట్ కూతురు కాదు..!

Picture of Alia Bhatt with her newborn baby is morphed.బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్ తల్లిదండ్రులు అయ్యారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2022 7:02 AM GMT
నిజమెంత: ఆ వైరల్ ఫోటోలో ఉన్నది ఆలియా భట్ కూతురు కాదు..!

బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్ తల్లిదండ్రులు అయ్యారు. నవంబర్ 6 న వారు ఆడబిడ్డకు స్వాగతం పలికారు. అప్పటి నుండి ఆలియా మరియు రణబీర్ తమ బిడ్డతో ఉన్న అనేక చిత్రాలు ఇంటర్నెట్‌లో క‌నిపిస్తున్నాయి.

ఈ నెల 6న తన భర్త రణబీర్ కపూర్‌ తో కలిసి హెచ్ఎన్‌ రిలయన్స్‌ ఆసుపత్రికి వచ్చిన ఆలియా భట్ అదే రోజు పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తల్లీ బిడ్డా క్షేమంగానే ఉన్నా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రి నుంచి ఆలియా భట్‌ని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఆలియా భట్- రణబీర్ కపూర్ వివాహం జరిగింది.

ఆలియా భట్ తన కుమార్తెతో ఉన్న ఫోటో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

ఫోటోలను చూడటానికి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ క్లిక్ చేయండి.

అయితే, ఆలియా తన ఆడపిల్ల చిత్రాలను బయటపెట్టిందా?

నిజ నిర్ధారణ:

NewsMeter బృందం తన నవజాత శిశువుతో ఆలియా భట్ ఉందని చెబుతున్న పోస్టులకు సంబంధించిన వైరల్ ఫోటోలలో ఒకదాని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. దీంతో 'ఇన్‌స్పైరలైజ్డ్' బ్లాగ్‌లోని అసలు ఇమేజ్‌కి దారితీసింది. బ్లాగ్ కథనంలో "రియో- సోల్ యొక్క జన్మ కథ (ఐడెంటికల్ ట్విన్స్!)" "Rio and Sol's Birth Story (Identical Twins!)." పేరుతో ఉంది.

ఈ కథనాన్ని అలీ మఫుచీ రాశారు. తన కవలల పుట్టుక గురించిన బ్లాగ్ పోస్ట్‌లో ఆమె రాశారు, "Today on the blog, I'm sharing the birth story of my identical twin boys, Rio and Sol! This birth was completely different from the births of my other children (as to be expected!) and it was just as equally beautiful and miraculous. Whatever your birth story is, it's magical!" తనకు ఇద్దరు కవలలు పుట్టారని ఆమె వెల్లడించింది. రియో-సోల్ అనే కవలలు పుట్టినట్లు వెల్లడించారు.


మేము ఒరిజినల్ చిత్రాన్ని జాగ్రత్తగా విశ్లేషించి, అది కేవలం మార్ఫింగ్ చేయడమే కాకుండా, ఒక బిడ్డను మాత్రమే చూపేలా ఎడిట్ చేశారని కనుగొన్నాము. రెండు ఫోటోలను మేము ఇక్కడ ఉంచాం.. మీరు పరిశీలించవచ్చు.


కపూర్ లేదా భట్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా పాప చిత్రాన్ని అప్‌లోడ్ చేయలేదు. అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అమ్మాయి పుట్టిందనే ప్రకటన మాత్రమే మాకు కనిపించింది. ఇదే ప్రకటనను ఇతర కుటుంబ సభ్యులు పోస్ట్ చేశారు.

దీన్ని బట్టి వైరల్ చిత్రాలు మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఆలియా భట్ కు పుట్టిన అమ్మాయికి సంబంధించిన నిజమైన చిత్రాలు ఎక్కడ కూడా పోస్ట్ చేయ‌లేదు.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.


Next Story
Share it