22 ఏళ్ల మాషా అమిని మరణం తర్వాత ఇరాన్‌లో నిరసనలు చెలరేగినప్పటి నుండి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, పోస్టులతో నిండిపోయింది. అమిని అరెస్టు అయిన తరువాత పోలీసు కస్టడీలో మరణించింది.
ఇరాన్ ప్రభుత్వం హిజాబ్ విధానానికి వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు నిరసన తెలుపుతున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. నగ్నంగా మహిళలు నిరసన తెలుపుతున్న వీడియో వైరల్ అవుతోంది. అదే వీడియోలో రెండు పెద్ద తోలుబొమ్మలు కూడా ఉన్నాయి.
ట్విటర్ యూజర్ వీడియోను షేర్ చేసి, "హిజాబ్ వ్యతిరేక నిరసనలో భాగంగా ఇరాన్‌లో టాప్‌లెస్ నిరసన చోటు చేసుకుంది" అని రాశారు."Anti Hijab protest has escalated to a topless protest in Iran." అని అందులో ఉంది.
పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
#IranProtest, #Hijab, and #AntiHijabProtest అనే హ్యాష్ ట్యాగ్స్ ను ఉపయోగించి పోస్టులు పెట్టారు.
పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.
నిజనిర్దారణ:
NewsMeter బృందం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వీడియో కీఫ్రేమ్, వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్‌ను కలిగి ఉన్న 2019 నుండి స్పానిష్ కథనం కనుగొనబడింది. చిలీలోని అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేసిన వీడియో అని కథనం పేర్కొంది.
వీడియోలోని రెండు పెద్ద తోలుబొమ్మలు మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా ఆధ్వర్యంలోని చిలీ పోలీసుల అణచివేత గురించి తెలియజేస్తున్నాయని కూడా తెలుస్తోంది.
కథనంలో 2019 సంవత్సరానికి సంబంధించిన అదే వీడియోను కలిగి ఉన్న ట్వీట్ కూడా ఉంది.
పోంటిఫిసియా యూనివర్సిడాడ్ కాటోలికా డి చిలీ ముందు ప్రదర్శన జరిగిందని కూడా కథనం పేర్కొంది. మేము ఆ విశ్వవిద్యాలయాన్ని జియోలొకేట్ చేసాము. వైరల్ వీడియోలో చూసిన ప్రాంతానికి సంబంధించిన స్ట్రీట్ వ్యూ కూడా కనుగొన్నాము.
మరో స్పానిష్ వెబ్‌సైట్, EL Cooperante, 26 నవంబర్ 2019న ప్రచురించిన కథనంలో సంఘటనను నివేదించే వైరల్ వీడియో స్క్రీన్‌షాట్‌ను కూడా ఉపయోగించింది.
వైరల్ వీడియో చిలీకి చెందినదని.. అది కూడా 2019 నాటిదని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు.