తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తారనే వీడియో ఇప్పటిది కాదు

Old Video Is Being Circulated As New On SocialMedia About Lockdown In Telangana

By Nellutla Kavitha  Published on  29 Dec 2022 1:15 PM GMT
తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తారనే వీడియో ఇప్పటిది కాదు

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది అంటూ ఆ వీడియోలో ఉంది. రేపు ఉదయం 10 గంటలకే ఇది అమలులోకి రాబోతోంది అంటూ వాట్సాప్ గ్రూప్ లలో ఈ వీడియో సర్క్యులేట్ అవుతోంది.

నిజ నిర్ధారణ

వాట్సాప్ గ్రూపులలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో లో నిజమెంత?! తెలుసుకునేందుకు ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. గూగుల్ కీ వర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు ఇటీవల జరిగిన తెలంగాణ క్యాబినెట్ భేటీకి సంబంధించి వార్తలు లభించాయి. డిసెంబర్ 10న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నట్టుగా వివిధ వార్తా సంస్థలు ఆర్టికల్స్ ప్రచురించారు. అయితే వీటిలో ఎక్కడా లాక్డౌన్ కి సంబంధించిన సమాచారం లేదు. వివిధ వార్తా సంస్థలు ఆర్టికల్స్ కోసం ఇక్కడ అండ్‌ ఇక్కడ క్లిక్‌ చేయండి.

దీంతో మరోసారి అడ్వాన్స్డ్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు 2011, మే 11న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ట్వీట్ కనిపించింది. ఇదే విషయాన్ని వివిధ న్యూస్ పేపర్స్ పబ్లిక్ చేశాయి.

వివిధ న్యూస్ పేపర్ల ఆర్టికల్స్‌ కోసం ఇక్కడ, ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక వాట్సాప్ గ్రూపులలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న v6 న్యూస్ ఛానల్ కి సంబంధించిన వీడియో క్లిప్ కూడా 2021లో యూట్యూబ్ లో పోస్ట్ అయ్యింది.


ఇక తెలంగాణ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం గురించి పూర్తి వివరాలు అందించే FactCheck_Telangana ట్విట్టర్ అకౌంట్ దీనిపై స్పందించింది. ఆ వీడియోని కొంతమంది కావాలని ఇప్పుడు షేర్ చేస్తున్నారని, దానిని నమ్మకూడదని ఇందులో ఉంది.

సో, తెలంగాణలో పది రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు అంటూ వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ గా షేర్ అవుతున్న వీడియో లో నిజం లేదు, అది పాత వీడియో.తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తారనే వీడియో ఇప్పటిది కాదు

Claim Review:తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తారనే వీడియో ఇప్పటిది కాదు
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:social media
Claim Fact Check:False
Next Story
Share it