“పది రూపాయల గాలిపటం కోసం పరిగెత్తిన ఈ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, పిల్లలు తస్మాత్ జాగ్రత్త !" అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరి కొంతమంది నెటిజన్లు కూడా ఫేస్‌బుక్‌లో దీనిని షేర్ చేస్తున్నారు. “పిల్లలకు చెప్పండి గాలిపటాల కంటే జీవితం చాలా గొప్పది” అంటూ 13 సెకండ్ల ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ
నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్నట్టుగా గాలిపటం కోసం పరిగెత్తుతున్నప్పుడే రోడ్ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి మరణించాడా ?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం గూగుల్ కీ వర్డ్ సెర్చ్ తో పాటుగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో ఈ సంఘటన గుజరాత్లో 2018లో జరిగినట్టుగా తెలిసింది. గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలో ఈ సంఘటన జరిగినట్టుగా Zee 24 Kalak అనే న్యూస్ ఛానల్ May 5, 2018 రోజున ఒక వార్తను యూట్యూబ్లో పబ్లిష్ చేసింది. Banaskantha: Major Accident Between Car & Pedestrian at Palanpur Deesa Highway,Pedestrian Died అనే డిస్క్రిప్షన్ తో ఈ వార్తను పోస్ట్ చేసింది.
పాలన్ పూర్-డీశా హైవే మీద ఒక యువకుడు పరిగెత్తుతూ రోడ్డు దాటుతున్నప్పుడు, వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం ఢీకొట్టడంతో ఎగిరిపడ్డ ఆ వ్యక్తి మరణించాడని ఈ వీడియోలో ఉంద
ఇక దీంతో పాటుగా May 6, 2018 రోజున AajTak ఇదే వార్తను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పాలన్ పూర్-డీశా రోడ్డుమీద వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి కొన్ని అడుగుల దూరం ఎగిరిపడ్డాడంటూ ఆజ్ తక్ 24 సెకండ్ల వీడియోను ట్వీట్ చేసింది.
పరపడా గ్రామానికి చెందిన రాజు భాయ్ హర్జీ భాయ్ ఠాకూర్ అనే వ్యక్తి సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడని, పాలన్ పూర్ దగ్గర్లోని దేవపూర్ పటియా దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా మరొక వార్తాపత్రిక వివరించింది.
అయితే ఈ వార్తా సంస్థలు ప్రచురించిన కథనాల్లో ఎక్కడ కూడా గాలిపటం కోసం ఆ యువకుడు పరిగెత్తుతూ, రోడ్డు దాటుతూ మరణించినట్టుగా వివరించలేదు. అలాగే 2018లో గుజరాత్లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ని, ఇటీవల గాలిపటం కోసం పరిగెత్తుతూ, కార్ ఢీకొని మరణించినట్టుగా తప్పుగా షేర్ చేస్తున్నారు.