అక్టోబరు 18న కేదార్‌నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు, ఐదుగురు యాత్రికులు మృతి చెందారు. కేదార్‌నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాటా దగ్గర ఈ ఘటన జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గుప్త్‌కాశి నుంచి కేదార్‌నాథ్‌కు యాత్రికులను తీసుకెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఈ నేపథ్యంలో గాలిలో హెలికాప్టర్ పేలిపోతున్న దృశ్యం వైరల్ అవుతోంది. ఇది కేదార్‌నాథ్ హెలికాప్టర్ క్రాష్ దృశ్యమని వినియోగదారులు పేర్కొన్నారు.
బీజేపీ నాయకుడు రాహుల్ గుర్జార్ ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ, "ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్‌కు యాత్రికులను తీసుకువెళుతున్న హెలికాప్టర్ క్రాష్ వార్త కలవరపెడుతోంది" అని రాశారు.
పోస్ట్‌ను యాక్సెస్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదే క్లెయిమ్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు ఇతర రాజకీయ నేతలు ఈ చిత్రాన్ని షేర్ చేశారు. (పోస్ట్‌లను యాక్సెస్ చేయడానికి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి)
సోషల్ మీడియా వినియోగదారులు కూడా అదే దావాతో చిత్రాన్ని పంచుకున్నారు. (పోస్ట్‌లను యాక్సెస్ చేయడానికి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి)
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. 2020లో ప్రచురించబడిన డెక్కన్ హెరాల్డ్ కథనంలో ఉపయోగించిన అదే చిత్రాన్ని కనుగొంది. రష్యాలో మిలిటరీ హెలికాప్టర్ క్రాష్ గురించి కథనం నివేదించింది.
ఇక, 2015లో iStockలో అప్‌లోడ్ చేయబడిన అదే చిత్రాన్ని మేము కనుగొన్నాము.
NewsMeter బృందం ఈ చిత్రం ఖచ్చితంగా ఎక్కడి నుండి తీసుకుని వచ్చారని ధృవీకరించలేకపోయింది. అయితే ఇది రెప్రజెంటేషన్ కోసం అనేక కథనాలలో ఉపయోగించినట్లు మేము కనుగొన్నాము (పోస్ట్‌లను యాక్సెస్ చేయడానికి ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి)
అక్టోబరు 18 నాటి కేదార్‌నాథ్ హెలికాప్టర్ క్రాష్‌కు.. ఈ వైరల్ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమైంది. కాబట్టి, వైరల్ దావా తప్పు.