శివలింగాన్ని పూజిస్తున్న దలైలామా చిత్రం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.
వైరల్ పోస్ట్‌లోని టెక్స్ట్ ప్రకారం " బౌద్ధుల మత గురువే శివుడిని పూజలు చేస్తున్నారని.. కానీ కొందరు నకిలీ బౌద్ధులు భగవంతుడిని పూజించమని ప్రమాణం చేస్తున్నారు" అని ఉంది. టెన్జిన్ గ్యాట్సో 14వ దలైలామా, తనను తాను సాధారణ బౌద్ధ సన్యాసిగా అభివర్ణించుకున్నారు. దలైలామా మత సామరస్యం, సమానత్వాన్ని విశ్వసించే గొప్ప మనిషి.
వైరల్ అవుతున్న ఫోటో వెనుక నిజమెంతో తెలుసుకుందాం.
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. దలైలామా అధికారిక వెబ్‌సైట్‌లో ఒక కథనాన్ని కనుగొంది. "దలైలామా మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు" అనే శీర్షికతో,18 జూలై 2012 నాటి కథనంలో దలైలామా ఆరు రోజుల పాటు కాశ్మీర్ లోయలో వివిధ ధార్మిక ప్రదేశాలలో పర్యటించారు.
కథనంలో ఈవెంట్స్, ఆయన భారతదేశంలో సందర్శించిన ప్రదేశాలను గురించి ప్రస్తావించారు. మేము కథనాన్ని జాగ్రత్తగా విశ్లేషించాము.. కానీ నకిలీ బౌద్ధుల గురించి, దేవతల గురించి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా కనుగొనబడలేదు.
అంతేకాకుండా, కశ్మీర్ లోయలో తన ఆరు రోజుల పర్యటన సందర్భంగా, దలైలామా వివిధ మతాలకు చెందిన మతపరమైన ప్రదేశాలలో నివాళులర్పించారు. "ఆధ్యాత్మిక నాయకుడు ప్రపంచంలో, ఆయా ప్రాంతాలలోనూ శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించారు" అని అందులో ఉంది..
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, మేము "ది దలైలామా విజిట్స్ శివ్ టెంపుల్ రైనావారి"("The Dalai Lama Visits Shiv Temple Rainawari") అనే శీర్షికతో ఒక YouTube వీడియోలో చూశాము. ఇందులో వైరల్ ఇమేజ్ కు సంబంధించిన దృశ్యం కూడా ఉంది.
Pinterest కూడా మేము ఇదే ఫోటోను చూశాము. ఆ ఫోటోకు "Buddhist Spiritual Leader Dalai Lama paying tributes at Gupt Ganga Shiv Temple on Tuesday" అని ఉంది.
దలైలామా చేసిన అటువంటి వ్యాఖ్యలను నివేదించే మీడియా నివేదికలు ఏవీ మాకు కనిపించలేదు.
దలైలామా శాంతి, సామరస్యాన్ని చాటడానికి దేవాలయాలను సందర్శించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, వైరల్ క్లెయిమ్ తప్పు.