ఓలా రెస్ట్ రూమ్స్ - ఏప్రిల్ ఫూల్ చేయడానికి విడుదలైన ఫ్రాంక్ వీడియోని నిజమని నమ్మి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు

Ola Restrooms - Is A April Fool Prank Video Shared As Real Advt On Social Media. "ఈ రోజుల్లో ఆన్లైన్లో లభించనిది ఏదైనా ఉందా" అంటూ ఫోన్ లో ఒక్క క్లిక్ తోనే

By Nellutla Kavitha  Published on  9 Jan 2023 9:23 AM GMT
ఓలా రెస్ట్ రూమ్స్ - ఏప్రిల్ ఫూల్ చేయడానికి విడుదలైన ఫ్రాంక్ వీడియోని నిజమని నమ్మి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు

"ఈ రోజుల్లో ఆన్లైన్లో లభించనిది ఏదైనా ఉందా" అంటూ ఫోన్ లో ఒక్క క్లిక్ తోనే మన ముందు ప్రత్యక్షమయ్యే మొబైల్ టాయిలెట్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓలా క్యాబ్స్ త్వరలో మొబైల్‌ టాయ్‌లెట్లను ప్రారంభించబోతున్నాయి అంటూ ఇదే వీడియోను ఫేస్బుక్ లో కూడా షేర్ చేస్తున్నారు మరికొంత మంది నెటిజన్లు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిజనిర్ధారణ

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టుగా నిజంగానే Ola Cabs మొబైల్ టాయిలెట్ సౌకర్యంతో క్యాబ్స్ తీసుకువస్తోందా?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో గతంలోనే ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ అయిన పోస్టులు కనిపించాయి. Apr 2, 2019 రోజున ఫేస్బుక్ లో "ఓలా మొబైల్ మరుగు దొడ్డి ... స్వచ్చ భారత్!…" అంటూ ఇదే వీడియోని పోస్ట్ చేశారు.

ఇక మరొక నెటిజన్ Feb 14, 2020 నాడు ఫేస్బుక్ లో ఓలా క్యాబ్స్ మొబైల్ టాయిలెట్ క్యాబ్స్ తీసుకువస్తే ఉండే లాభాల్ని వివరిస్తూ ఒక పోస్ట్‌ని పబ్లిష్‌ చేశారు.

https://www.facebook.com/ashok.vemulapalli.1/videos/3016384391727436

దీంతో గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. Ola Restrooms పేరుతో సరికొత్త సదుపాయాన్ని తీసుకు వస్తున్నట్టుగా March 29, 2019 రోజున Ola ఒక వీడియోను యూట్యూబ్ లో పబ్లిష్ చేసింది.


అయితే అదే Ola April 2, 2019 రోజున "Thank you for laughing with us" అనే మరో వీడియోను రిలీజ్ చేసింది. Ola Restrooms పేరుతో తాము అంతకు ముందు రిలీజ్ చేసిన వీడియో నిజం కాదని, అయితే దేశంలో టాయిలెట్ల కొరతతో పాటుగా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయని ఈ వీడియోలో పేర్కొంది. పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచడంతో పాటుగా టాయిలెట్ల సదుపాయాన్ని కల్పించడానికి, ఏప్రిల్ 2 నుంచి తాము Gramalaya అనే సంస్థతో కలిసి పని చేస్తున్నట్టుగా ఆ వీడియోలో ప్రకటించింది Ola.


"Water, Sanitation and Hygiene for All" అనే లక్ష్యంతో 1987 ఏర్పడింది Gramalaya. https://www.gramalaya.org/home

ఇక ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా గతంలోనూ Ola ఇలాంటి వీడియోలనే చేసింది. సరికొత్తగా Ola Rooms పేరుతో రివల్యూషన్ తీసుకొస్తున్నామంటూ April 1, 2016 ఒక వీడియోను రిలీజ్ చేసింది Ola.

అయితే అది ప్రాంక్ వీడియో అంటూ వివిధ వార్తా సంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ఇక్కడ చూడవచ్చు. ఆర్టికల్స్‌ కోసం ఇక్కడ అండ్‌ ఇక్కడ క్లిక్‌ చేయండి.

దీంతోపాటే Apr 1, 2015 కూడా Ola, Ola Air పేరుతో విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టుగా మరొక వీడియో రిలీజ్ చేసింది.

అయితే అది కూడా ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఓలా సంస్థ పబ్లిష్ చేసిన ప్రాంక్ వీడియోగా తేలింది. https://www.bgr.in/news/olacabs-takes-april-fools-day-to-new-heights-with-ola-air-prank-347237/

ఇక ఇటీవలే, 2021 లో Ola AirPro పేరుతో మరో April Fool Day Prank Video రిలీజ్ చేసింది.

https://www.livemint.com/auto-news/ola-airpro-the-flying-car-is-here-and-you-can-book-your-test-flight-here-s-how-11617261284774.html

సో, Ola ఏప్రిల్ ఫూల్స్ డే రోజు 2019లో ఫ్రాంక్ వీడియోగా పబ్లిష్ చేసిన ఓలా మొబైల్ టాయిలెట్స్ క్యాబ్స్ నిజమని భావిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఓలా రెస్ట్ రూమ్స్ ఒక ప్రాంక్ వీడియో మాత్రమే.

Claim Review:ఓలా రెస్ట్ రూమ్స్ - ఏప్రిల్ ఫూల్ చేయడానికి విడుదలైన ఫ్రాంక్ వీడియోని నిజమని నమ్మి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు
Claimed By:social media users
Claim Reviewed By:Newsmeter
Claim Source:social media
Claim Fact Check:False
Next Story
Share it