ఒక రోడ్డుపైన చిరుత పులిని మూడు అడవి పందులు కొరుకుతున్నటువంటి దృశ్యాలని "ఘాట్ రోడ్డు తిరుపతి" లో జరిగిందన్న సందేశంతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్కిలేట్ అవుతోంది.
https://www.facebook.com/reel/3313333215648521/
నిజ నిర్ధారణ
నిజంగానే తిరుపతి ఘాట్ రోడ్ లో చిరుత పులి మీద అడవి పందులు ఇలా దాడి చేశాయా?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది. దీంతో గతంలోనే ఇదే దృశ్యాలు కలిగిన కొన్ని వీడియోలను యూట్యూబ్లో కొంతమంది నేటిజన్స్ పోస్ట్ చేసినట్టుగా తేలింది. May 5,2022 రోజున HB Kennel అనే యూట్యూబ్ ఛానల్ లో ఈ సంఘటన వెస్ట్ బెంగాల్లో జరిగినట్టుగా పోస్ట్ చేశారు.
మరొక యూట్యూబ్ ఛానల్, Wilderness of India ఈ సంఘటన కొడైకెనాల్ రోడ్డు మీద జరిగినట్టుగా, అదే రోజు అంటే May 5, 2022 న పోస్ట్ చేసింది.
'డిస్టర్బింగ్ విజువల్స్' అంటూ May 5, 2022 రోజున పళని-కొడైకెనాల్ రోడ్డు మీద ఈ సంఘటన జరిగినట్టుగా https://twitter.com/WildLense_India అనే ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది.
దీంతో ఇంటర్నెట్లో మరోసారి కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఈ సంఘటన తమిళనాడులోని పళని-కొడైకెనాల్ రోడ్డు మీద జరిగినట్టుగా వార్తా సంస్థలు ప్రచురించిన విషయం తెలిసింది. ఏడాది వయసు ఉన్న చిరుతపులిని వేగంగా వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో అది మరణించిందని, దీంతో రోడ్డు మీద నిర్జీవంగా పడి ఉన్న చిరుత పులిని మూడు అడవి పందులు కోరుతున్న దృశ్యాలను ఆ రోడ్డుమీద వెళ్తున్న ఒక వాహనదారుడు చిత్రించినట్టుగా ఇండియా టుడే వార్త కథనాన్ని ప్రచురించింది.
తమిళనాడులోని కొడైకెనాల్‌లో ఏడాది వయసున్న చిరుతపులి గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయింది, దాన్ని అడవి పందులు కొరుక్కు తింటున్న దృశ్యాలను ఆ ప్రాంతంలోని ఓ వాహనదారుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు అంటూ ఆంధ్రప్రభ కూడా ఈ వార్తను పబ్లిష్ చేసింది.
సో, గత ఏడాది మే నెలలో తమిళనాడు లోని పళని-కొడైకెనాల్ రోడ్డు మీద జరిగిన ప్రమాదం దృశ్యాలని జరిగినట్లుగా ఇప్పుడు షేర్ చేస్తున్నారు.