FactCheck : మహేష్ బాబుకు సంబంధించిన ఆ వార్త నిజం కాదు
No The News About Super Star Mahesh Babu is False. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
By Nellutla Kavitha Published on 28 Oct 2022 12:28 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడు, నిర్మాతగానే కాకుండా సౌత్ ఇండియాలో ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్ లను కలిగి ఉన్న నటుడిగా కూడా నిలిచారు మహేష్ బాబు. సోదరుడు రమేష్ బాబుతో పాటుగా తల్లి ఇందిరా దేవి మరణం తరువాత మహేష్ బాబుకి సంబంధించి మరొక విషాద వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అత్యధిక ప్రజాదరణ ఉన్న నటుడు మహేష్ బాబు ఆత్మహత్య చేసుకుని మరణించారని, అందుకు గల కారణాలు తెలియరాలేదని అంటూ ఒక వీడయోని పోస్ట్ చేసింది బాలీవుడ్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మహేష్ బాబు ఆత్మహత్య చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిందని, పోలీసులు కారణాలు అన్వేషించే పనిలో ఉన్నారని, అయితే ఇది ఫేక్ న్యూసా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆ వీడియో సారాంశం.
నిజనిర్ధారణ:
తల్లి మరణం తర్వాత అక్టోబర్ 3న అస్తికలను హరిద్వార్లో కలిపారు మహేష్ బాబు. అందుకు సంబంధించిన వార్త ఇది.
ఆ తర్వాత కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం లండన్ కి వెళ్లారని పిఆర్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. లండన్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఐడియా అంటూ మహేష్ బాబుతో పాటుగా ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటోలని నమ్రత ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
ఇక మహేష్ బాబు దీపావళి పండుగ రోజు తమ కూతురు సితార డాన్స్ చేస్తూ విషెస్ చెప్తున్న వీడియోను తన ఇన్స్టా ఇటీవలె పోస్ట్ చేశారు.
మహేష్ బాబు మరణ వార్తకు సంబంధించి పోస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ లో గత వీడియోలను గమనించినట్లైతే గాసిప్పులు, రూమర్లకు సంబంధించిన విషయాలే వీడియోలుగా కనిపిస్తున్నాయి. మిథున్ చక్రవర్తి, శత్రుఘ్నసిన్హా, అమితాబచ్చన్, మహేశ్ భట్ ఇలా బాలీవుడ్ ప్రముఖులు మరణించారన్న వార్తలు, గాసిప్ లు , యూట్యూబ్ ఛానల్ లో వీడియోలుగా పోస్ట్ చేస్తున్నారు.
దీంతో పాటుగా పదేపదే సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా పెళ్ళికి సంబంధించిన వార్తలు, వీడియోలు పోస్ట్ చేయడం కనిపించింది.
దీనిపై గతంలోనే సోనాక్షిసిన్హా రెస్పాండ్ కూడా అయ్యారు. ఆ వార్తలన్నీ ఫేక్ వార్తలను కొట్టిపారేశారు.
బాలీవుడ్ అడ్డా కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ చూస్తే క్రికెట్ అడ్డా, అనే ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ తో పాటుగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లింకు కూడా కనిపించింది. దానిని ఫర్హాన్ మోయిన్ అనే వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్టుగా ఉంది.
ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలను పరిశీలించినప్పుడు తను ఆపరేట్ చేస్తున్న మరొక యూట్యూబ్ ఛానల్ క్రికెట్ సెంచరీ,
ఇటీవలే లక్ష మంది సబ్స్క్రైబ్ పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా వచ్చిన ట్రోఫీతో ఒక ఫోటో కూడా ఉంది.
బాలీవుడ్ అడ్డా మహేష్ బాబుకు సంబంధించి పోస్ట్ చేసిన వీడియో గురించి రెస్పాండ్ అవ్వండని పీఆర్ టీం ని అడిగితే అదంతా ఫేక్ న్యూస్ గా కొట్టిపారేసింది టీం.
సినిమా స్టార్లలో ట్విట్టర్లో 13 లక్షల మంది ఫాలోవర్లతో సౌత్ ఇండియా లోనే most followed actor గా సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారని, మిగతా వాటిని తప్పుడు వార్తలుగా కొట్టిపారేసింది టీం.
సో మహేష్ బాబు మరణ వార్తకి సంబంధించి వచ్చిన వార్త తప్పుడు వార్త.